త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Malreddy Rangareddy | విద్యార్థినుల‌తో ప్రేమ‌గా మాట్లాడినా.. త‌ప్పేముంది

MLA Malreddy Rangareddy | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుతీరు గురించి తెలుసుకునేందుకు ఆర్టీసీ బస్సెక్కిన నేపథ్యంలో సోషల్‌ మీడియాలో బీఆర్ఎస్ చేసిన ప్రచారంపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి స్పందించారు.

S

Telangana | Published On Oct 7, 2026, 4.15 pm IST

MLA Malreddy Rangareddy | విద్యార్థినుల‌తో ప్రేమ‌గా మాట్లాడినా.. త‌ప్పేముంది
Advertisement

ఆడ‌బిడ్డ‌లంటే నాకు అపార‌మైన గౌర‌వం నాకుంది
బీఆర్ఎస్ పార్టీ పెయిడ్ టీమ్ చేస్తున్న దుర్మార్గాల‌ను గ‌మ‌నించాలి
రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేసిన ఇబ్ర‌హీంప‌ట్నం ఎమ్మెల్యే మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి

MLA Malreddy Rangareddy | త్రినేత్ర న్యూస్ : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుతీరు గురించి తెలుసుకునేందుకు ఆర్టీసీ బస్సెక్కిన నేపథ్యంలో సోషల్‌ మీడియాలో బీఆర్ఎస్ చేసిన ప్రచారంపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి స్పందించారు. బస్సు ప్రయాణం గురించి తన బిడ్డల్లాంటి విద్యార్థినులతో ప్రేమగా మాట్లాడితే... దానిని వక్రీకరించటం సరికాదన్నారు. కాలేజ్‌ జోన్‌ అయిన ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఉచిత బస్సు ప్రయాణం ఎక్కువగా ఉపయోగించుకుంటారని... దీని అమలుతీరును పరిశీలించేందుకే నిన్న బొంగ్లూర్‌ ఓఆర్ఆర్‌ వద్ద ఆర్టీసీ బస్సెక్కిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణం చేసేందుకు టికెట్ తీసుకుని కూర్చున్నా. చాలా మంది పెద్ద‌లు, అమ్మాయిల‌తో మాట్లాడాను. ఇంకా కొన్ని బ‌స్సులు ఎక్కువ కావాలి.. ర‌ద్దీగా ఉంద‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ‌లు చేసిన ఫ్రీ బ‌స్సు వ‌ల్ల ఏడాదికి రూ. 45 వేలు ఆదా అవుతుంది. మా త‌ల్లిదండ్రుల‌కు కూడా మేలు జ‌రుగుతుంద‌న్నారు. వెనుకున్న కొంత మంది అమ్మాయిలు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి అంకుల్ అంటూ మాకు ఏదో చెబుతున్నారు. కార్న‌ర్‌లో తిరిగే స‌మ‌యంలో ఆ అమ్మాయి కొద్దిగా నా చేయి వెనుక ఉన్న‌ట్టుంది.. మ‌ర్యాద‌గా బిడ్డ‌లాంటి ఆ అమ్మాయితో చేయి ప‌ట్టుకుని మాట్లాడితే త‌ప్పేముంది. ఇంకా ప్రేమ‌గా మాట్ల‌దాడిన‌ట్టు. కొంత మంది ప‌నికిమాలిన వెధ‌వ‌లు చేస్తున్న‌టువంటి ప్ర‌చారాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నించండి. మా మీడియా మిత్రులు కూడా ఉన్నారు. నిజంగానే ఏదైనా త‌ప్పు జ‌రిగితే సోష‌ల్ మీడియా కంటే మీడియా ప్ర‌తినిధులు వేసేవారు. బాధ క‌లిగించింది. మ‌హిళ‌ల మీద గౌర‌వం ఎక్కువ‌. బీఆర్ఎస్ పార్టీ పెయిడ్ టీమ్ చేస్తున్న దుర్మార్గాల‌ను గ‌మ‌నించాల‌ని కోరుతున్నాను అని మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు.

 

Advertisement
Advertisement