TGPSC | రెండు శాఖల్లో 290 ఇంజినీర్ కొలువులు.. టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు
TGPSC | త్రినేత్ర.న్యూస్: సర్కారు కొలువుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అన్నట్లుగానే వివిధ శాఖల్లో 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ (TGPSC) మూడు నోటిఫికేన్లు విడుదల చేసింది.
TGPSC | త్రినేత్ర.న్యూస్: సర్కారు కొలువుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అన్నట్లుగానే వివిధ శాఖల్లో 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ (TGPSC) మూడు నోటిఫికేన్లు విడుదల చేసింది. ఇందులో రోడ్లు భవనాల శాఖలో సివిల్ విభాగంగలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు, ఎలక్ట్రికల్ విభాగంలో 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. అర్హులైనవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని పోస్టులకు అభ్యర్థులు 44 ఏండ్ల వయస్సులోపు వారై ఉండాలి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రతి నెల రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు వేతనం ఉంటుంది.
మొత్తం పోస్టులు: 290
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్- 222
ఈ మల్టీ జోన్ పోస్టులు రోడ్ల భవనాల శాఖ సివిల్ విభాగంలో ఉన్నాయి.
అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేసి, 2026, జూన్ 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల లోపువారై ఉండాలి.
దరఖాస్తులు: జూన్ 6 నుంచి జూలై 13 వరకు
ఎంపిక విధానం: ఓఎంఆర్ లేదా సీబీటీ విధానంలో
పరీక్ష: అక్టోబర్‌లో..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్- 49
ఈ ఖాళీలు రోడ్లు భవనాల శాఖలోని ఎలక్ట్రికల్ విభాగంలో ఉన్నాయి. ఇవి రాష్ట్రస్థాయి కేడర్.
అర్హతలు: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేయాలి. 2026, జూన్ 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల లోపువారై ఉండాలి.
దరఖాస్తులు: జూన్ 8 నుంచి జూలై 15 వరకు
పరీక్ష: అక్టోబర్‌లో
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్- 19
ఈ రాష్ట్రస్థాయి కేడర్ పోస్టులు కాలుష్య నియంత్రణ మండలిలో ఉన్నాయి.
అర్హతలు: సివిల్, మెకానికల్, మెకికల్, బయోటెక్నాలజీ, మైనింగ్, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరంగ్‌లో డిగ్రీ చేయాలి. లేదా ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్‌లో పీజీ పూర్తిచేసినవారై ఉండాలి. 2026, జూన్ 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల లోపువారై ఉండాలి.
దరఖాస్తులు: జూన్ 10 నుంచి జూలై 17వ వరకు
పరీక్షలు: అక్టోబరులో
హాల్‌టికెట్లు: పరీక్షకు వారం రోజుల ముందు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.
వెబ్‌సైట్: https://www.tgpsc.gov.in
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్: ఈ నియామక పరీక్షలను ఓఎంఆర్ లేదా కంప్యూటర్ ఆధారితంగా (సీబీఆర్‌టీ) నిర్వహించేది పత్రికా ప్రకటన లేదా వెబ్‌నోట్ జారీ చేస్తారు.
తాజావార్తలు
- ●Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!
- ●Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు
- ●Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?
- ●DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!
- ●Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు
- ●Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!

Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!

Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు

Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?

DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!





