TGOs | టీజీవో ఫోరం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ప్రేమ్ కరణ్ రెడ్డి, మోర శ్రీనివాస్
TGOs | తెలంగాణ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ టీజీవో ఫోరం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్. ప్రేమ్ కరణ్ రెడ్డి, మోర శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు ఆదివారం నాంపల్లిలోని టీజీవో భవన్‌లో నిర్వహించారు.
TGOs | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ టీజీవో ఫోరం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్. ప్రేమ్ కరణ్ రెడ్డి, మోర శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు ఆదివారం నాంపల్లిలోని టీజీవో భవన్‌లో నిర్వహించారు. టీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ శ్యామ్ సమక్షంలో ఈ ఎన్నికలు జరగ్గా, ఎన్నికల అధికారిగా ప్రొఫెసర్ గడ్డం మల్లేశం, సహాయ ఎన్నికల అధికారిగా డాక్టర్ కే రామారావు వ్యవహరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో అధికారులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా టీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస రావు నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి అభినందనలు తెలియజేస్తూ, ప్రభుత్వ అధికారులుగా ప్రభుత్వ ఆదేశాల మేరకు విధులు నిర్వర్తిస్తూనే ప్రజలకు సేవ చేయడంతో పాటు ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఉద్యోగుల ప్రధాన సమస్యలైన పీఆర్సీ, కరువు భత్యం, పెన్షన్‌దారుల పెండింగ్ బిల్లులు, సీపీఎస్ స్థానంలో ఓపీఎస్ వంటి సమస్యలను వీలైనంత త్వరగా ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.
స్థానిక సంస్థలలో అదనపు కలెక్టర్ పోస్టుల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 70 శాతం పోస్టులను భర్తీ చేయాలి. రాష్ట్రంలోని కొత్త జిల్లాలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (Dy. CEO) కేటగిరీలలో ఒక్కొక్క పోస్టును ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలోని కొత్త జిల్లాలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (DRDO) / అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (Addl. DRDO) కేటగిరీలలో ఒక్కొక్క పోస్టును ఏర్పాటు చేయాలి. డిప్యూటీ సీఈఓల (Dy. CEOs) అధికారిక విధుల కోసం శాశ్వత ప్రాతిపదికన రెగ్యులర్ వాహనాలను సమకూర్చాలి. అదేవిధంగా డీఆర్‌డీఓలు (DRDOs), అదనపు డీఆర్‌డీఓల (Addl. DRDOs) అధికారిక విధుల కోసం శాశ్వత ప్రాతిపదికన రెగ్యులర్ వాహనాలను సమకూర్చాలి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి (PR & RD) శాఖకు చెందిన DRDO/TGIRD తదితర సంస్థల్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు, PR & RD శాఖలో వివిధ పథకాల కింద పనిచేస్తున్న ఉద్యోగులందరికీ రాష్ట్రంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా “010–జీతాలు” పద్దు కింద జీతాలు డ్రా చేసుకునేందుకు అనుమతి మంజూరు చేయాలి. పంచాయతీ రాజ్ / V.B. G RAM G / SERP పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల సేవలను డిప్యూటేషన్ సర్వీసుగా/OD పరిగణించాలి. అయితే, వీటిని ఫారిన్ సర్వీస్ నిబంధనలు మరియు షరతుల పరిధిలోకి తీసుకురాకూడదు. ఎందుకంటే, పై విభాగాలన్నీ ప్రభుత్వ శాఖల Single HoD పరిధిలోనే ఉన్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం, ఆర్థిక శాఖ ద్వారా జారీ చేసిన సర్క్యులర్ మెమో నం. 22777/113/FR.II/2012, తేదీ: 11-09-2012లో స్పష్టీకరణ ఇచ్చింది. ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలను పునర్వ్యవస్థీకరించినప్పుడు, రెవెన్యూ శాఖ వలె పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి (PR & RD) శాఖలో కూడా కొత్త పోస్టులను మంజూరు చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విధంగా ప్రతి రెవెన్యూ డివిజన్‌కి డివిజనల్ డెవలప్మెంట్ అధికారిని పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ నుంచి నియమించాలి అని డిమాండ్ చేశారు.
టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. శ్యామ్ మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అధికారులందరూ ఐకమత్యంతో పనిచేస్తూ కేంద్ర సంఘం సూచనలు, ఆదేశాలకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణలో చురుకుగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ రెడ్డి, గండూరి వెంకట్, శ్రీనేష్ కుమార్ నోరి, నూతనకంటి వెంకట్, కిషన్ ప్రసాద్, షోకత్ హుస్సేన్, శ్రీరామ్ తదితరులు పాల్గొని ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.
తాజావార్తలు
- ●Danam Nagender | తప్పులతడకగా సర్ ప్రక్రియ : దానం నాగేందర్
- ●Shweta Basu Prasad | టాలీవుడ్లోకి శ్వేతాబసు ప్రసాద్ రీఎంట్రీ - కొత్త బంగారం లోకం హీరోతో మిస్టరీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్
- ●No UPI Day | అక్టోబర్ 2న ‘నో UPI డే’.. మొబైల్ రిటైలర్ల నిరసన
- ●Komatireddy Rajagopal Reddy | అయ్యా! నీ వల్లే మాకు కండ్ల ఆపరేషన్లు.. పెద్ద కొడుకులెక్క సూస్కుంటున్నవ్
- ●Iran US conflict | శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్: అమెరికాకు తీవ్ర నష్టం తప్పదంటూ ఇరాన్ ఆర్మీ వార్నింగ్
- ●John Wesley | బ్యాంక్ ఉద్యోగుల సమ్మెకు సీపీఐ(ఎం) మద్దతు

Danam Nagender | తప్పులతడకగా సర్ ప్రక్రియ : దానం నాగేందర్

Shweta Basu Prasad | టాలీవుడ్లోకి శ్వేతాబసు ప్రసాద్ రీఎంట్రీ - కొత్త బంగారం లోకం హీరోతో మిస్టరీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్

No UPI Day | అక్టోబర్ 2న ‘నో UPI డే’.. మొబైల్ రిటైలర్ల నిరసన

Komatireddy Rajagopal Reddy | అయ్యా! నీ వల్లే మాకు కండ్ల ఆపరేషన్లు.. పెద్ద కొడుకులెక్క సూస్కుంటున్నవ్




