త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGEJAC | భూపాలపల్లిలో ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలి.. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్‌

TGEJAC | భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ఎదుట విధి నిర్వహణలో ఉన్న ఆర్టీవో వెంకన్న ఇసుక లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన తీవ్ర విషాదకరమని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (TGEJAC) చైర్మన్ వీ. లచ్చిరెడ్డి అన్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

G

Telangana | Published On Jun 22, 2026, 12.28 pm IST

TGEJAC | భూపాలపల్లిలో ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలి.. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్‌
Advertisement

TGEJAC | త్రినేత్ర‌.న్యూస్‌: భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ఎదుట విధి నిర్వహణలో ఉన్న ఆర్టీవో వెంకన్న ఇసుక లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన తీవ్ర విషాదకరమని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (TGEJAC) చైర్మన్ వీ. లచ్చిరెడ్డి అన్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మృతుడి కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించడంతో పాటు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి, తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులకు అవసరమైన భద్రతా చర్యలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీవో వెంకన్న అకాల మరణం పట్ల తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తరఫున ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

Advertisement
Advertisement