త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGCHE | సినిమా కోసం కాలేజీకి సెల‌వు.. మ‌ల్లారెడ్డి వ‌ర్సిటీకి ఉన్న‌త విద్యామండలి నోటీసులు!

TGCHE | సినిమా కోసం కాలేజీకి ప్ర‌క‌టించిన మ‌ల్లారెడ్డి డీమ్డ్ యూనివ‌ర్సిటీకి (Malla Reddy University) రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి (TGCHE) నోటీసు జారీచేయాల‌ని నిర్ణ‌యించింది. విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ (SFI) ఫిర్యాదుతో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ది.

G

Telangana | Published On Oct 30, 2026, 10.41 am IST

TGCHE | సినిమా కోసం కాలేజీకి సెల‌వు.. మ‌ల్లారెడ్డి వ‌ర్సిటీకి ఉన్న‌త విద్యామండలి నోటీసులు!
Advertisement

TGCHE | త్రినేత్ర న్యూస్‌: ఒక‌ప్పుడు రాజ‌కీయ కార్య‌క్ర‌మాల‌కు వేదిక‌లుగా మారుతున్నాయ‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న విద్యాసంస్థ‌లు.. ఇప్పుడు సిన‌మా ఈవేంట్లకు అడ్డాలుగా మారుతున్నాయి. ప్ర‌తీవారం ఏదో ఒక సినిమా ఫంక్ష‌న్లను నిర్వ‌హిస్తూ నిత్యం వార్త‌ల్లో ఉంటున్నాయి. తాజాగా ఓ సినిమా కోసం కాలేజీకే సెల‌వు (Holiday) ప్ర‌క‌టించ‌ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేశ్ హీరోగా రూపొందించిన `ఆద‌ర్శ కుటుంబం` (Adarsha Kutumbam) ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లోని మ‌ల్లారెడ్డి కాలేజీలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మ‌ల్లారెడ్డి విద్యాసంస్థ‌ల వైర్ చైర్‌ప‌ర్స‌న్ ప్రీతిరెడ్డి (Preeti Reddy) మాట్లాడుతూ.. సినిమా రిలీజ్ రోజైన అక్టోబ‌ర్ 30న కాలేజీకి సెల‌వు ప్ర‌క‌టించారు. దీంతో సినిమా కోసం కాలేజీకి సెల‌వు ఇవ్వ‌డం ఏంట‌ని స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇదే విష‌య‌మై మ‌ల్లారెడ్డి డీమ్డ్ యూనివ‌ర్సిటీకి (Malla Reddy University) రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి (TGCHE) నోటీసు జారీచేయాల‌ని నిర్ణ‌యించింది.

దీనిపై సమ‌గ్ర విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఎస్ఎఫ్ఐ (SFI) రాష్ట్ర అధ్య‌క్షుడు ర‌జ‌నీకాంత్‌, ఇత‌ర నేత‌లు ఉన్న‌త‌ విద్యామండ‌లి చైర్మ‌న్‌కు ప్రొఫెస‌ర్ వీ.బాల‌కిష్టారెడ్డికి (Professor Balakista Reddy) ఫిర్యాదు చేశారు. దీంతో వ‌ర్సిటీకి నోటీసులు ఇచ్చి వివ‌ర‌ణ కోరుతామ‌ని చైర్మ‌న్ వారికి హామీ ఇచ్చారు.

మ‌రోవైపు వ‌ర్సిటీలు, విద్యా సంస్థ‌లు విద్యార్థుల భ‌ద్ర‌త‌పై చ‌ట్టం తీసుకు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని భావించిన ఆయ‌న బిల్లు ముసాయిదాను రూపొందించారు. ఇప్ప‌టికే దానిని విద్యాశాఖ కార్య‌ద‌ర్శి యోగితా రాణాతోపాటు సీఎం కార్యాల‌య ముఖ్య కార్య‌ద‌ర్శి శ్రీధ‌ర్ స‌మ‌ర్పించారు.

సినిమా కోసం సెల‌వేంటి?

సినిమా కోసం కాలేజీకి (Malla Reddy Colleges) సెల‌వు ఇవ్వ‌డం ఏంట‌ని నెటిజ‌న్లు మ‌ల్లారెడ్డి కాలేజీ యాజ‌మాన్యంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. కాలేజీలా లేక సినిమా ప్ర‌మోష‌న్ ఏజెన్సీలా? అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా మండిప‌డుతున్నారు. ఇలాంటి కాలేజీల్లో త‌మ పిల్ల‌ల‌ను చేర్పించే ముందు త‌ల్లిదండ్రులు ఒక‌టికి రెండుసార్లు ఆలోచించాలంటూ పోస్టులు పెడుతున్నారు.

Advertisement
Advertisement