NIMS | అర్ధరాత్రి 2 గంటల వరకు నిమ్స్‌లో ఏసీబీ సోదాలు.. టెండర్ల కేటాయింపులపై ఆరా..
NIMS | పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్న నిమ్స్‌ను (NIMS) అవినీతి జాడ్యం పట్టిపీడిస్తున్నది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ (Lakshmi Bhaskar) అరెస్టుతో మొదలైన ఏసీబీ (ACB Raids) దర్యాప్తు, ఇప్పుడు దవాఖాన టెండర్లు, కాంట్రాక్టులు, మందుల కొనుగోళ్ల వరకు విస్తరించింది.
NIMS | త్రినేత్ర న్యూస్: పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్న నిమ్స్‌ను (NIMS) అవినీతి జాడ్యం పట్టిపీడిస్తున్నది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ (Lakshmi Bhaskar) అరెస్టుతో మొదలైన ఏసీబీ (ACB Raids) దర్యాప్తు, ఇప్పుడు దవాఖాన టెండర్లు, కాంట్రాక్టులు, మందుల కొనుగోళ్ల వరకు విస్తరించింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ప్రారంభమైన ఏసీబీ అధికారుల తనిఖీలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. క్యాంటీన్ నుంచి సెక్యూరిటీ వరకు, మెడికల్ స్టోర్ల నుంచి ఔషధాల నాణ్యత వరకు ప్రతీ ఫైలును అధికారులు క్షుణ్నంగా పరిశీలించారు.
గతంలో హాస్పిటల్‌లో కేటాయించిన పలు టెండర్లలో (Hospital Tenders) లక్ష్మీభాస్కర్ కీలక పాత్ర పోషించినట్లు ఏసీబీ భావిస్తున్నది. సెక్యూరిటీ, మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్, మెడికల్ షాప్, క్యాంటీన్, సర్జికల్ డిపార్ట్‌మెంట్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమాలకు సంబంధించిన ఆధారాల సేకరణలోనే అధికారులు ఈ సోదాలు పూర్తి చేశారు.

ఏసీబీ, టీజీ సేఫ్‌కు చెందిన 30 మందికిపైగా అధికారులతో కూడిన బృందంతో గురువారం అర్ధరాత్రి 2 గంటల వరకు విస్తృత సోదాలు నిర్వహించింది. నిమ్స్ క్యాంటిన్‌లో ఫుడ్ ఇన్ స్పెక్టర్లు తనిఖీలు చేయగా, సర్జికల్ స్టోర్‌లో డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు ఫైళ్లను పరిశీలించారు. 2014 నుంచి జరిగిన అన్ని టెండర్లకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ప్రధానంగా స్టోర్స్, మ్యాన్‌పవర్ రిక్రూట్‌మెంట్, సెక్యూరిటీ, క్యాంటీన్, మెడికల్ షాపు టెండర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఏసీబీ అధికారులు అడిగిన ఫైళ్లను నిమ్స్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ ఆధ్వర్యంలోని డాక్డర్ల బృందం అందచేసినట్లు సమాచారం.
సంబంధిత వార్తలు

ACB | ఏసీబీకి చిక్కిన లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్, పెట్రోల్ బంక్ టెక్నీషియన్
అక్టోబర్ 28, 2026

ACB Raids | లెక్కలేని డబ్బు రూ.2.40 లక్షలు.. ఏసీబీకి పట్టుబడ్డ జలమండలి అధికారి
అక్టోబర్ 25, 2026

ACB Raids | భూపాలపల్లి డీఆర్డీఏలో ఏసీబీ దాడులు.. ప్రాజెక్టు అధికారి సతీష్ రెడ్డి అరెస్ట్
అక్టోబర్ 22, 2026
తాజావార్తలు
- ●Comrade Kalyan | ఓటీటీలోకి వచ్చేసిన కామ్రేడ్ కళ్యాణ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
- ●Israel Elections | నెతన్యాహుకి షాక్.. అతిపెద్ద కూటమిగా అవతరించినా.. మెజార్టీకి దూరంగా..
- ●Chocolate Murder | చాక్లెట్ కోసం గొడవ.. 4 ఏండ్ల బాలుడిని చంపిన బాలిక
- ●Binance Hack | క్రిప్టో చరిత్రలోనే అతి పెద్ద సైబర్ దాడి.. 5.8 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో చోరీ.. క్రిప్టో కరెన్సీలు భారీగా పతనం..
- ●TGPSC | టీజీపీఎస్సీ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు.. నేటి నుంచి దరఖాస్తులు
- ●SIR | రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు

Comrade Kalyan | ఓటీటీలోకి వచ్చేసిన కామ్రేడ్ కళ్యాణ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Israel Elections | నెతన్యాహుకి షాక్.. అతిపెద్ద కూటమిగా అవతరించినా.. మెజార్టీకి దూరంగా..

Chocolate Murder | చాక్లెట్ కోసం గొడవ.. 4 ఏండ్ల బాలుడిని చంపిన బాలిక

Binance Hack | క్రిప్టో చరిత్రలోనే అతి పెద్ద సైబర్ దాడి.. 5.8 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో చోరీ.. క్రిప్టో కరెన్సీలు భారీగా పతనం..



