Comrade Kalyan | ఓటీటీలోకి వచ్చేసిన కామ్రేడ్ కళ్యాణ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Comrade Kalyan | నక్సల్ బ్యాక్‌డ్రాప్‌లో శ్రీవిష్ణు హీరోగా (Sree Vishnu) నటించిన చిత్రం కామ్రేడ్ కళ్యాణ్ (Comrade Kalyan). ఈ నెల 9న థియేటరల్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.
Comrade Kalyan | త్రినేత్ర న్యూస్: నక్సల్ బ్యాక్‌డ్రాప్‌లో శ్రీవిష్ణు హీరోగా (Sree Vishnu) నటించిన చిత్రం కామ్రేడ్ కళ్యాణ్ (Comrade Kalyan). ఈ నెల 9న థియేటరల్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో నెల తిరగక ముందే ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నది. అంటూ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు వచ్చాడు. కోన వెంకట్ సమర్పణలో వెంటక కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్, షైన్ టాం చాకో, ఉపేంద్ర లిమాయే ముఖ్య పాత్రల్ని పోషించారు.
కథేంటంటే..
1990ల కాలం నాటి ఆంధ్ర - ఒడిశా సరిహద్దులోని నక్సల్స్ ప్రభావిత గ్రామంలో జరిగే వినోదాత్మక పీరియాడిక్ కామెడీ డ్రామా ఇది. టూరింగ్ టాకీస్ నడిపే కళ్యాణ్ అనే యువకుడు తన సినిమా థియేటర్‌ను కాపాడుకోవడానికి కమ్యూనిస్ట్ భావజాలాన్ని ఎలా వాడాడు, ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేదే కథ.
90వ దశకంలో అన్నల ప్రభావం ఎక్కువగా ఉన్న అటవీ ప్రాంతంలో జార్జ్ కుట్టి (షైన్ టాం చాకో) స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్‌గా వస్తాడు. అతడిపై మాస్టర్ దళం దాడి చేస్తుంది. ఇక అక్కడి మాడగుల ప్రాంతంలో కళ్యాణ్ (శ్రీ విష్ణు) థియేటర్‌లో ఆపరేటర్‌గా పని చేస్తుంటాడు. ఒరియా అమ్మాయిగా సితార (మహిమా నంబియార్) ఆ ఊరికి వస్తుంది. తెలుగమ్మాయే అయినప్పటికీ ఒరియా అమ్మాయిగా నటిస్తూ ఉంటుంది. ఆమెతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు కళ్యాణ్. ఆ అమ్మాయి అన్న చేసిన అప్పుల కారణంగా బిష్వాస్ (ఉపేంద్ర లిమాయే) ఆ కుటుంబం వెంట పడతాడు. అప్పు చెల్లించకపోతే సితారని తీసుకు వెళ్లి పెండ్లి చేసుకుంటా అని బిష్వాస్ అంటాడు. ఆ డబ్బు తాను ఇస్తానని మాటిస్తాడు కళ్యాణ్. అయితే ఆ డబ్బు కోసం కళ్యాణ్ ఏం చేశాడు? కళ్యాణ్‌కీ, అడవిలో అన్నలకీ సంబంధం ఏమిటీ? తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథ.
సంబంధిత వార్తలు

Tata Play Smart | ఇక సెట్‌టాప్ బాక్స్ అవసరం లేదు.. రూ.199కే 500కు పైగా టీవీ ఛానల్స్..
అక్టోబర్ 15, 2026

Sai Pallavi | రామాయణ రిలీజ్ ముంగిట తెలుగు టాక్ షోకు గెస్ట్‌గా సాయిపల్లవి – జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 ప్రారంభం
అక్టోబర్ 13, 2026

Malayalam OTT | టాలీవుడ్ హీరోయిన్ మలయాళం థ్రిల్లర్ మూవీ – ఒకే రోజు ఆరు ఓటీటీలలో రిలీజ్
అక్టోబర్ 6, 2026
తాజావార్తలు
- ●Israel Elections | నెతన్యాహుకి షాక్.. అతిపెద్ద కూటమిగా అవతరించినా.. మెజార్టీకి దూరంగా..
- ●Chocolate Murder | చాక్లెట్ కోసం గొడవ.. 4 ఏండ్ల బాలుడిని చంపిన బాలిక
- ●Binance Hack | క్రిప్టో చరిత్రలోనే అతి పెద్ద సైబర్ దాడి.. 5.8 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో చోరీ.. క్రిప్టో కరెన్సీలు భారీగా పతనం..
- ●TGPSC | టీజీపీఎస్సీ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు.. నేటి నుంచి దరఖాస్తులు
- ●SIR | రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు
- ●Horoscope | అక్టోబర్ 30 రాశిఫలాలు.. ప్రేమ వ్యవహారాలు చాలా రొమాంటిక్‌గా ఉంటాయి!

Israel Elections | నెతన్యాహుకి షాక్.. అతిపెద్ద కూటమిగా అవతరించినా.. మెజార్టీకి దూరంగా..

Chocolate Murder | చాక్లెట్ కోసం గొడవ.. 4 ఏండ్ల బాలుడిని చంపిన బాలిక

Binance Hack | క్రిప్టో చరిత్రలోనే అతి పెద్ద సైబర్ దాడి.. 5.8 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో చోరీ.. క్రిప్టో కరెన్సీలు భారీగా పతనం..

TGPSC | టీజీపీఎస్సీ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు.. నేటి నుంచి దరఖాస్తులు



