Holiday | అర్నబ్ తుఫాను ఎఫెక్ట్.. నేడు భద్రాద్రి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
Holiday | త్రినేత్ర న్యూస్: అర్నబ్ తుఫాను (Arnab Cyclone) భూభాగాన్ని తాకింది. యానాం దక్షిణంగా నరసాపురానికి సమీపంలో తీరంలోకి ప్రవేశింది. దీంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలోకూడా అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావారణ శాఖ (IMD) తెలిపింది.
Holiday | త్రినేత్ర న్యూస్: అర్నబ్ తుఫాను (Arnab Cyclone) భూభాగాన్ని తాకింది. యానాం దక్షిణంగా నరసాపురానికి సమీపంలో తీరంలోకి ప్రవేశింది. దీంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలోకూడా అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావారణ శాఖ (IMD) తెలిపింది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు (Holiday) ప్రకటించారు. భారీ వర్షాలు మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు బుధవారం (అక్టోబర్ 28న) సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ వెల్లడించారు.
తుఫాను (Cyclone Arnab) ప్రభావంతో ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, హన్మకొండ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ఇక గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వివరించింది. శుక్రవారం పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే సూచనలున్నాయని వాతావరణశాఖ వివరించింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్
- ●Horoscope | అక్టోబర్ 28 రాశిఫలాలు.. తెలివితేటలతో కోరికలు నెరవేర్చుకుంటారు!
- ●Minister Ponnam | కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి పొన్నం
- ●Cyclone Arnab | ఏపీ తీరంవైపుగా ‘అర్నబ్’ తుపాను.. యానాం సమీపంలో తీరం దాటే ఛాన్స్..
- ●CM Revanth Reddy | గ్లోబల్ సమ్మిట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Osmania University | ఓయూలో తొలిసారిగా ఫాస్మి ద్వైవార్షిక సదస్సు

ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్

Horoscope | అక్టోబర్ 28 రాశిఫలాలు.. తెలివితేటలతో కోరికలు నెరవేర్చుకుంటారు!

Minister Ponnam | కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి పొన్నం

Cyclone Arnab | ఏపీ తీరంవైపుగా ‘అర్నబ్’ తుపాను.. యానాం సమీపంలో తీరం దాటే ఛాన్స్..





