త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

University Men’s Hostel | యూత్ కాంగ్రెస్‌, ఎస్ఎఫ్ఐ ఘ‌ర్ష‌ణ‌.. ర‌ణ‌రంగంగా యూనివ‌ర్సిటీ మెన్స్‌ హాస్ట‌ల్‌

University Men's Hostel | యూత్ కాంగ్రెస్‌, ఎస్ఎఫ్ఐ కార్య‌క‌ర్త‌ల ఘ‌ర్ష‌ణ‌తో యూనివ‌ర్సిటీ మెన్స్ హాస్ట‌ల్ (University Men's Hostel) ప్రాంతం ర‌ణ‌రంగంగా మారింది. రాళ్లు, కాగ‌డాల‌తో ఇరు వ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం దాడులకు పాల్ప‌డ్డాయి. సుమారు మూడు గంట‌ల పాటు వ‌ర్సిటీలో తీవ్ర ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

G

National | Published On Oct 1, 2026, 7.38 am IST

University Men’s Hostel | యూత్ కాంగ్రెస్‌, ఎస్ఎఫ్ఐ ఘ‌ర్ష‌ణ‌.. ర‌ణ‌రంగంగా యూనివ‌ర్సిటీ మెన్స్‌ హాస్ట‌ల్‌
Advertisement

University Men's Hostel | త్రినేత్ర న్యూస్‌: యూత్ కాంగ్రెస్‌, ఎస్ఎఫ్ఐ కార్య‌క‌ర్త‌ల ఘ‌ర్ష‌ణ‌తో యూనివ‌ర్సిటీ మెన్స్ హాస్ట‌ల్ (University Men's Hostel) ప్రాంతం ర‌ణ‌రంగంగా మారింది. రాళ్లు, కాగ‌డాల‌తో ఇరు వ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం దాడులకు పాల్ప‌డ్డాయి. సుమారు మూడు గంట‌ల పాటు వ‌ర్సిటీలో తీవ్ర ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

కేర‌ళ‌లోని తిరువ‌నంతపురంలో (Thiruvananthapuram) కేంద్ర‌ ఎన్నిక‌ల సంఘం చీఫ్ క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ అకౌంటెంట్ జ‌న‌ర‌ల్ కార్యాల‌యానికి యూత్‌కాంగ్రెస్ (Youth Congress) కార్య‌క‌ర్త‌లు ర్యాలీ నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ర్యాలీ ఎస్ఎఫ్ఐ (SFI) ప‌ట్టున్న‌ యూనివ‌ర్సిటీ మెన్స్ హాస్ట‌ల్ వ‌ద్ద‌కు చేరుకోగానే లోప‌లి నుంచి నిరస‌న‌కారుల‌పైకి రాళ్లు రువ్విన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో ర్యాలీ అనంత‌రం ఎస్ఎఫ్ఐ కార్య‌క‌ర్త‌లు ఉన్న హాస్ట‌ల్ వైపు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు దూసుకెళ్లారు. హాస్ట‌ల్‌పైకి రాళ్లు రువ్వ‌డంతో వాళ్లు కూడా ఎదురుదాడికి దిగారు. ఇది యూనివ‌ర్సిటీ కాలేజీ క్యాంప‌స్ కూడా వ్యాపించ‌డంతో కేఎస్‌యూ, యూత్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు కాలేజీ ప్రాంగ‌ణంలోకి ప్ర‌వేశించారు. గోడ‌లు దూకి ఫ్లెక్సీలు ధ్వంసం చేశారు. ఇరు వ‌ర్గాలు రాళ్లు, కాగ‌డాల‌తో ప‌ర‌స్ప‌రం దాడులకు దిగ‌డంతో ప‌రిస్థితి తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారితీసింది. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు విద్యార్థుల‌పై లాఠీచార్జ్ చేశారు. టియ‌ర్ గ్యాస్ (Tear Gas) ప్ర‌యోగించారు.

కాగా, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు హాస్టల్ వైపు కర్రలు, రాళ్లు, వెలుగుతున్న కాగడాలు విసిరి విద్యార్థులను రెచ్చగొట్టడం వల్లే ఈ ఘర్షణ జరిగిందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి పీఎస్. సంజీవ్ సంజీవ్ ఆరోపించారు. పోలీసులు విద్యార్థులపై బలప్రయోగం చేశారని, లాఠీఛార్జ్ లో కొందరికి తల పగిలిందని, మరికొందరికి గాయాలయ్యాయని చెప్పారు.

Advertisement
Advertisement