త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG TET | ఇంకా 7 వేల మంది టీచ‌ర్లు ‘టెట్’ ఫెయిల్

TG TET | ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష ఉత్తీర్ణ‌త సాధించ‌లేని ఇన్ స‌ర్వీస్ టీచ‌ర్ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా టెట్ ఎగ్జామ్ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. శ‌నివారం విడుద‌లైన టెట్ ఫ‌లితాల్లో 15,749 మంది(70.07 శాతం) టీచ‌ర్లు ఉత్తీర్ణ‌త సాధించారు.

S

Telangana | Published On Sep 26, 2026, 3.08 pm IST

TG TET | ఇంకా 7 వేల మంది టీచ‌ర్లు ‘టెట్’ ఫెయిల్
Advertisement

టెట్ ప‌రీక్ష‌ల‌కు 22,477 మంది హాజ‌రు
70.07 శాతం ఉత్తీర్ణత

TG TET | త్రినేత్ర న్యూస్ : ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష ఉత్తీర్ణ‌త సాధించ‌లేని ఇన్ స‌ర్వీస్ టీచ‌ర్ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా టెట్ ఎగ్జామ్ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. శ‌నివారం విడుద‌లైన టెట్ ఫ‌లితాల్లో 15,749 మంది(70.07 శాతం) టీచ‌ర్లు ఉత్తీర్ణ‌త సాధించారు. ఇంకా 7 వేల మంది టీచ‌ర్లు ఉత్తీర్ణ‌త కాలేదు. సెప్టెంబ‌ర్ 8, 9 తేదీల్లో నిర్వ‌హించిన టెట్ ప‌రీక్ష‌ల‌కు 22,477 మంది టీచ‌ర్లు హాజ‌ర‌య్యారు.

టెట్ పేప‌ర్‌-1కు 4,942 మంది టీచ‌ర్లు హాజ‌రు కాగా 3,398 మంది పాస‌య్యారు. పేప‌ర్ -2(మ్యాథ్స్ అండ్ సైన్స్‌)కు 9,131 మంది టీచ‌ర్లు హాజ‌రు కాగా 6,720 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. పేప‌ర్-2(సోష‌ల్ స్ట‌డీస్)కు 8,404 మంది టీచ‌ర్లు హాజ‌రు కాగా 5,631 మంది పాస‌య్యారు.

ఇక రెండో టెట్ నోటిఫికేష‌న్ అక్టోబ‌ర్ 1వ తేదీన విడుద‌ల కానుంది. వీలైనంత త్వ‌ర‌గా ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, న‌వంబ‌ర్‌లో ఫ‌లితాలు విడుద‌ల చేస్తామ‌న్నారు.

Advertisement
Advertisement