త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG TET | టీజీ టెట్ నిర్వ‌హ‌ణ తేదీ మార్పు..! ఎందుకంటే..?

TG TET | రాష్ట్రంలోని ఇన్ స‌ర్వీస్ టీచ‌ర్ల కోసం రెండో టెట్‌( TG TET )ను న‌వంబ‌ర్ 19న నిర్వ‌హించాల‌ని విద్యాశాఖ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. కానీ అదే రోజు టీజీపీఎస్సీ( TGPSC ) డిపార్ట్‌మెంట‌ల్ ప‌రీక్ష‌లు ఉన్నందున టెట్ నిర్వ‌హ‌ణ తేదీని మారే అవ‌కాశం ఉంది.

S

Telangana | Published On Nov 11, 2026, 6.26 am IST

TG TET | టీజీ టెట్ నిర్వ‌హ‌ణ తేదీ మార్పు..! ఎందుకంటే..?
Advertisement

TG TET | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలోని ఇన్ స‌ర్వీస్ టీచ‌ర్ల కోసం రెండో టెట్‌( TG TET )ను న‌వంబ‌ర్ 19న నిర్వ‌హించాల‌ని విద్యాశాఖ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. కానీ అదే రోజు టీజీపీఎస్సీ( TGPSC ) డిపార్ట్‌మెంట‌ల్ ప‌రీక్ష‌లు ఉన్నందున టెట్ నిర్వ‌హ‌ణ తేదీని మారే అవ‌కాశం ఉంది. ఎందుకంటే చాలా మంది టీచ‌ర్లు డిపార్ట్‌మెంట‌ల్ ప‌రీక్ష‌లు రాయ‌నున్న నేప‌థ్యంలో టెట్ తేదీని మార్చాల‌ని విజ్ఞ‌ప్తులు అందాయి. దీంతో టెట్ నిర్వ‌హ‌ణ తేదీ మార్పుపై విద్యాశాఖ అధికారులు పున‌రాలోచ‌న చేస్తున్నారు.

రెండో టెట్‌కు మొత్తం 10,586 మంది టీచ‌ర్లు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కొందరు పేపర్‌-1కు 2,591 మంది, పేప‌ర్-2కు 7,995 మంది హాజ‌రు కానున్నారు. హాల్‌టికెట్లను నవంబరు 12వ తేదీ నుంచి పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

Advertisement
Advertisement