త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG SET | ప్ర‌శాంతంగా ముగిసిన టీజీ సెట్ 2025 ప‌రీక్ష‌లు

TG SET | అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ లెక్చరర్ల నియామకంలో కనీస అర్హత కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ ప‌రీక్ష‌లు (TG-SET 2025) ప్రశాంతంగా ముగిశాయి.

S

Telangana | Published On Dec 24, 2025, 7.00 pm IST

TG SET | ప్ర‌శాంతంగా ముగిసిన టీజీ సెట్ 2025 ప‌రీక్ష‌లు
Advertisement

TG SET | త్రినేత్ర.న్యూస్ : అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ లెక్చరర్ల నియామకంలో కనీస అర్హత కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ ప‌రీక్ష‌లు (TG-SET 2025) ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు సెట్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ బి. శ్రీనివాస్ నేతృత్వంలో అధికారుల బృందం ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని TG-SET కార్యాలయం నుంచి పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు.

మూడు రోజుల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష 2025కు 45,127 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 37,706 మంది(83.56 శాతం) హాజ‌ర‌య్యారు. ఎక్కడ ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా, అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించిన అధికారులను ఓయూ వీసీ కుమార్ మొలుగరం అభినందించారు. పరీక్షల విజయవంతం బృంద స్పూర్తిగా నిదర్శనమని అన్నారు. టీజీసెట్ నిర్వహణలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ బి. శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. వీలైనంత త్వరగా పరీక్ష ఫలితాలు వెల్లడిస్తామని అన్నారు.

Advertisement
Advertisement