Analog Paneer | పనీర్ లవర్స్‌కు బిగ్ షాక్.. రాష్ట్రంలో ఏడాదిపాటు నిషేధం.!
Analog Paneer | ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ (Telangana) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా చెలామణి అవుతున్న పాలతో సంబంధం లేకుండా రసాయనాలు, ఇతర పదార్థాలతో తయారుచేసే నాన్-డెయిరీ లేదా కృత్రిమ పనీర్ (Analogue Paneer) తయారీ, విక్రయాలపై పూర్తి నిషేధం విధించింది.
Analog Paneer | త్రినేత్ర.న్యూస్: ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ (Telangana) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా చెలామణి అవుతున్న పాలతో సంబంధం లేకుండా రసాయనాలు, ఇతర పదార్థాలతో తయారుచేసే నాన్-డెయిరీ లేదా కృత్రిమ పనీర్ (Analogue Paneer) తయారీ, విక్రయాలపై పూర్తి నిషేధం విధించింది. ఇది ఏడాది పాటు అమల్లో ఉంటుందని స్పష్టంచేసింది. ఈ మేరకు
తెలంగాణ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ అథారిటీ (TG SAFE) ఉత్తర్వులు జారీ చేసింది. పనీర్ పేరుతో అనలాగ్ లేదా నాన్-డెయిరీ పదార్థాలను తయారు చేయడం, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ చేయడం, పంపిణీ, రవాణా, విక్రయించడంపై రాష్ట్రవ్యాప్తంగా కఠిన నిషేధం అమలులో ఉంటుందని పేర్కొంది. `ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006` నిబంధనల ప్రకారం ఈ నిషేధాజ్ఞలు అమల్లోకి వస్తాయని టీజీ సేఫ్ కమిషనర్ వెల్లడించారు.
దీనిప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి నాన్-డెయిరీ (Non Dairy Paneer) లేదా కృత్రిమ పనీరు తయారు చేయడం, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ చేయడం, పంపిణీ చేయడం, విక్రయించడం పూర్తిగా నేరమని చెప్పారు. ఈ నిషేధం 2026, సెప్టెంబర్ 10 నుంచి తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయని ప్రకటించారు. అసలైన పనీర్ పేరుతో మార్కెట్‌లో విక్రయిస్తున్న నకిలీ, రసాయనిక పనీర్ వల్ల ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతున్నదని, నిబంధనలు ఉల్లంఘించి కృత్రిమ పనీర్ విక్రయించినా, నిల్వ చేసినా ఆహార భద్రత చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

CM Revanth reddy | పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేసే ప్రసక్తే లేదు : సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్ 11, 2026

HYDRAA Portal | అందుబాటులోకి ‘హైడ్రా’ అధికారిక పోర్టల్.. చెరువుల సమాచారం తెలుసుకోండిలా..
సెప్టెంబర్ 11, 2026

CM Revanth Reddy | జెన్ ఆల్ఫా, జెన్ బీటా గురించి ఆలోచిస్తున్నా : సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●Hartalika Teej | ఒకే రోజు హర్తాళికా తీజ్ తీజ్–వినాయక చవితి.. ఈ నాలుగురాశుల వారికి అన్నీ శుభాలే..!
- ●Horoscope | సెప్టెంబర్ 12 రాశిఫలాలు.. పాత సమస్యలు మళ్లీ తెరపైకి రావచ్చు!
- ●Budhaditya Raja Yogam | త్వరలో బుధాదిత్య రాజయోగం.. ఈ నాలుగు రాశులకు కెరీర్, ఆర్థికంగా అన్ని అనుకూల ఫలితాలే..!
- ●Uterus | ఆ యువకుడికి వృషణాలు లేవు.. పరీక్షలో బయటపడ్డ గర్భాశయం
- ●Teenmar Mallanna | స్కిల్ యూనివర్సిటీ వీసీకి పీహెచ్డీ పట్టా కూడా లేదు : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
- ●CM Revanth reddy | పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేసే ప్రసక్తే లేదు : సీఎం రేవంత్ రెడ్డి

Hartalika Teej | ఒకే రోజు హర్తాళికా తీజ్ తీజ్–వినాయక చవితి.. ఈ నాలుగురాశుల వారికి అన్నీ శుభాలే..!

Horoscope | సెప్టెంబర్ 12 రాశిఫలాలు.. పాత సమస్యలు మళ్లీ తెరపైకి రావచ్చు!

Budhaditya Raja Yogam | త్వరలో బుధాదిత్య రాజయోగం.. ఈ నాలుగు రాశులకు కెరీర్, ఆర్థికంగా అన్ని అనుకూల ఫలితాలే..!

Uterus | ఆ యువకుడికి వృషణాలు లేవు.. పరీక్షలో బయటపడ్డ గర్భాశయం



