త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Inter Results | ఏప్రిల్ 5 లేదా 6న టీజీ ఇంట‌ర్ ఫ‌లితాలు..!

TG Inter Results | తెలంగాణ ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు నేటితో ముగిశాయి. అయితే ఏప్రిల్ 5 లేదా 6వ తేదీన ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

S

Telangana | Published On Mar 13, 2026, 7.05 pm IST

TG Inter Results | ఏప్రిల్ 5 లేదా 6న టీజీ ఇంట‌ర్ ఫ‌లితాలు..!
Advertisement

TG Inter Results | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు నేటితో ముగిశాయి. ఇప్ప‌టికే ఆయా స‌బ్జెక్టుల జ‌వాబు ప‌త్రాల మూల్యాంక‌నం కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో మూల్యాంక‌నం వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి ఫ‌లితాలు ఇచ్చేందుకు ఇంట‌ర్ బోర్డు క‌స‌ర‌త్తు చేస్తోంది. అయితే ఏప్రిల్ 5 లేదా 6వ తేదీన ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

ఇంట‌ర్ ప్ర‌థమ‌, ద్వితీయ సంవ‌త్స‌రానికి సంబంధించిన జ‌వాబు ప‌త్రాల మూల్యాంక‌నం మార్చి 31 వ‌ర‌కు పూర్త‌య్యే అవ‌కాశం ఉంది. అనంత‌రం ఒక‌టికి రెండు సార్లు మార్చుల‌ను చెక్ చేసుకొని, ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఫ‌లితాల విడుద‌ల‌లో ఎలాంటి సాంకేతిక స‌మ‌స్య తలెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఇంట‌ర్ బోర్డు అధికారులు పేర్కొన్నారు.

విద్యార్థుల సంబురాలు

శుక్ర‌వారంతో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ముగిశాయి. దీంతో విద్యార్థులు హ‌మ్మ‌య్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఏడాది పాటు క‌ష్ట‌ప‌డి చ‌దివిన విద్యార్థులంద‌రూ సంబురాలు చేసుకున్నారు. ప‌ట్ట‌ణాల నుంచి త‌మ సొంతూర్ల బాట ప‌ట్టారు. దీంతో ఆర్టీసీ బ‌స్సులు, రైళ్లు ఇంట‌ర్ విద్యార్థుల‌తో కిక్కిరిసిపోయాయి.

ఇంట‌ర్ పరీక్ష‌ల‌కు 4,38,506 మంది విద్యార్థులు హాజ‌రైన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం 54 మాల్ ప్రాక్టీస్ కేసులు న‌మోదైన‌ట్లు తెలిపారు. గ‌తేడాది 115 మాల్ ప్రాక్టీస్ కేసులు న‌మోదు అయ్యాయి.

Advertisement
Advertisement