TG ICET | ఈ నెల 12 నుంచి ఐసెట్ దరఖాస్తులు.. పరీక్ష ఎప్పుడంటే?
TG ICET | త్రినేత్ర.న్యూస్: మేనేజ్‌మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులైన ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA)లో ప్రవేశాల కోసం నిర్వహించే TG ICET-2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి.
TG ICET | త్రినేత్ర.న్యూస్: మేనేజ్‌మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులైన ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA)లో ప్రవేశాల కోసం నిర్వహించే TG ICET-2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. మార్చి 16 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అప్లయ్ చేసుకోవచ్చు. మే 13, 14 తేదీల్లో పరీక్షను నిర్వహిస్తారు. పరీక్ష మూడు సెషన్లలో ఉంటుంది. మొదటి సెషన్ మే 13న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో సెషన్ అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఇక మూడో సెషన్ మే 14న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ ఏడాది నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) ఐసెట్‌ను నిర్వహిస్తున్నది.
అన్ రిజర్వ్‌డ్ క్యాటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుం రూ.750, రిజర్వ్‌డ్ క్యాటగిరీ అభ్యర్థులు రూ.550 చెల్లించాలని సూచించారు. దరఖాస్తులు అధికారిక వెబ్ సైట్ icet.tgche.ac.inలో అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు
రిజిస్ట్రేషన్: ఈ నెల12 నుంచి మార్చి 16 వరకు
దరఖాస్తుల సవరణ: ఏప్రిల్ 18 నుంచి 24 వరకు
హాల్ టికెట్లు: మే 4 నుంచి
పరీక్ష తేదీలు: మే 13, 14
పరీక్షల ప్రాథమిక కీ: మే 29
ఫైనల్ కీ, తుది ఫలితాలు: జూన్ 19
సంబంధిత వార్తలు

TG LAWCET | ఐసెట్‌ను మించి.. లాసెట్‌కు పెరుగుతున్న దరఖాస్తులు
ఏప్రిల్ 22, 2026

MG University | మొహం కడుక్కోడానికీ నీళ్లు లేవ్.. ఎంజీ యూనివర్సిటీలో నెల రోజులుగా విద్యార్థుల అవస్థలు
మార్చి 26, 2026

Entrance Exams | ఫిబ్రవరి మొదటివారంలో ఈసెట్, లాసెట్ నోటిఫికేషన్లు.. దరఖాస్తులు ఎప్పటి నుంచంటే?
జనవరి 28, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



