TG EdCET | ఈ నెల 21 నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్.. నేడు నోటిఫికేషన్
TG EdCET | రాష్ట్రంలో రెండేండ్ల బీఈడీ (TG EdCET)తోపాటు బీపీఎడ్ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్), డీపీఎడ్ సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ (Counseling Schedule) విడుదలైంది. ఈ నెల 21 నుంచి వేర్వేరుగా కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది.
TG EdCET | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో రెండేండ్ల బీఈడీ (TG EdCET)తోపాటు బీపీఎడ్ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్), డీపీఎడ్ సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ (Counseling Schedule) విడుదలైంది. ఈ నెల 21 నుంచి వేర్వేరుగా కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానుంది. ఎడ్‌సెట్ అభ్యర్థులకు ఈ నెల 21 నుంచి 28 వరకు, పీఈసెట్‌కు 21-25 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ ఉండనుంది. ఆగస్టు 2 నుంచి 4 వరకు ఎడ్‌సెట్, జూలై 28 నుంచి 30 వరకు పీఈసెట్‌కు వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోవచ్చు. ఆగస్టు 2న బీపీఎడ్ (BPEd), డీపీఎడ్ (DPEd) సీట్లను, ఆగస్టు 8న బీఈడీ సీట్లను కేటాయిస్తారు.
ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ వివరాలు..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28,771 మంది అభ్యర్థులు ఈ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. వారిలో 27,887 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు. మొత్తంగా 96.95 శాతం మంది విద్యార్థులు పరీక్షలో క్వాలిఫై అయ్యారు.
నోటిఫికేషన్: జూలై 14
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ల అప్‌లోడింగ్: జూలై 21 నుంచి 28 వరకు
ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల (NCC / CAP / PH / Sports) ఫిజికల్ వెరిఫికేషన్: జూలై 28 నుంచి 31 వరకు
- ఎన్‌సీసీ అభ్యర్థులకు జూలై 28న
- క్యాప్ అండ్ పీహెచ్ అభ్యర్థులకు జూలై 29న
- స్పోర్ట్స్ అభ్యర్థులకు జూలై 31న
రిజిస్టర్డ్ అభ్యర్థుల జాబితా ప్రదర్శన (సవరణలకు అవకాశం): ఆగస్టు 01
వెబ్ ఆప్షన్ల నమోదు (మొదటి విడత): ఆగస్టు 2 నుంచి 4
వెబ్ ఆప్షన్ల సవరణ (ఎడిట్ ఆప్షన్): ఆగస్టు 4
మొదటి విడత సీట్ల కేటాయింపు (కాలేజీల వారీగా): ఆగస్టు 8
కళాశాలల్లో రిపోర్టింగ్, ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలన, ఫీజు చెల్లింపు: ఆగస్టు 10 నుంచి 14 వరకు
వెబ్‌సైట్: https://edcetadm.tgche.ac.in
తాజావార్తలు
- ●Revanth Reddy | కొడంగల్, అచ్చంపేటలో.. సీఎం రేవంత్ రెడ్డి పేరుతో ఓట్లు.. SIRతో వెలుగులోకి
- ●Horoscope | జూలై 14 రాశిఫలాలు.. ఈ రాశివారు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి!
- ●Dangerous Salary 2026 | నెలకు లక్ష సంపాదిస్తున్నారా? ఆ జీతం చాలా డేజంర్ అంటున్న యువతి.. ఎందుకో తెలుసా?
- ●Vijayashanthi on Shabad Murder Case | షాబాద్ నరమేధానికి పోలీసుల లంచమే కారణమా? మహిళా భద్రతపై విజయశాంతి సంచలన కామెంట్స్!
- ●CM Revanth Reddy MPs Meeting | రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధికి కృషి చేద్దాం
- ●CM Revanth Reddy | ఎస్సీలకు వారి జనాభా శాతం కంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాం

Revanth Reddy | కొడంగల్, అచ్చంపేటలో.. సీఎం రేవంత్ రెడ్డి పేరుతో ఓట్లు.. SIRతో వెలుగులోకి

Horoscope | జూలై 14 రాశిఫలాలు.. ఈ రాశివారు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి!

Dangerous Salary 2026 | నెలకు లక్ష సంపాదిస్తున్నారా? ఆ జీతం చాలా డేజంర్ అంటున్న యువతి.. ఎందుకో తెలుసా?

Vijayashanthi on Shabad Murder Case | షాబాద్ నరమేధానికి పోలీసుల లంచమే కారణమా? మహిళా భద్రతపై విజయశాంతి సంచలన కామెంట్స్!






