TG EAPCET | టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్.. ఎప్పటి నుంచి అంటే?
TG EAPCET | ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన తెలంగాణ ఎప్‌సెట్ (TG EAPCET) ఇజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ (engineering admissions) విడుదలైంది. మూడు విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తారు.
TG EAPCET | త్రినేత్ర.న్యూస్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన తెలంగాణ ఎప్‌సెట్ (TG EAPCET) ఇజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ (engineering admissions) విడుదలైంది. మూడు విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తారు. జూన్ 19 నుంచి తొలి విడత కౌన్సెలింగ్ కానుంది. రెండో విడత జూలై 17 నుంచి, మూడో విడత జూలై 31న ప్రారంభమౌతుంది.
మొదటి విడత కౌన్సెలింగ్
జూన్ 19న తొలి విడత (First Phase) కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుంది. ఈ నెల 28 వరకు స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పిస్తారు. 22 నుంచి 29 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. 25 నుంచి జూలై 1 వరకు వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోవచ్చు. జూలై 4న మాక్ సీట్ అలకేషన్ నిర్వహించి అదే నెల 10న తొలి విడత సీట్లు కేటాయిస్తారు. జూలై 10 నుంచి 14 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
రెండో విడత..
రెండో విడత కౌన్సెలింగ్ (Second Phase) జూలై 17 ప్రారంభమౌతుంది.
అదే రోజున స్లాట్ బుకిక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ధ్రువపత్రాల పరిశీలన: జూలై 18
వెబ్ ఆప్షన్లు: జూలై 18, 19
వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్: జూలై 19న
సీట్ల కేటాయింపు: జూలై 22 లేదా అంతకంటే ముందు
సెల్ఫ్ రిపోర్ట్: జూలై 25 నుంచి 28 వరకు
సీట్ల రద్దు: జూలై 28 వరకు అవకాశం
థార్డ్ ఫేస్ కౌన్సెలింగ్
మూడో విడత (Final Phase Schedule) ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్: జూలై 31
వెబ్ ఆప్షన్లు: జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు
సర్టిఫికెట్ పరిశీలన: ఆగస్టు 1
వెబ్ ఆప్షన్స్ ఫ్రీజింగ్: ఆగస్టు 2
సీట్ల కేటాయింపు: ఆగస్టు 5న లేదా అంతకంటే ముందు
ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: ఆగస్టు 5 నుంచి ఆగస్టు 7 వరకు
ఇంటర్నల్ స్లైడింగ్ (కళాశాలల్లో బ్రాంచ్ మార్పు): ఆగస్టు 12, 13
స్లైడింగ్ సీట్ల కేటాయింపు: ఆగస్టు 15
- మూడో విడత సీట్ల కేటాయింపు పూర్తయిన తర్వాత, చేరిన కాలేజీలోనే వేరే బ్రాంచ్ మారాలనుకునే విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ అవకాశం కల్పిస్తారు.
తాజావార్తలు
- ●Tollywood | ఇండియన్ టాప్ 100 సెలిబ్రిటీస్ లిస్ట్‌లో అల్లు అర్జున్ , రామ్‌చరణ్ - టాలీవుడ్ నుంచి ఇద్దరికే చోటు!
- ●Ethics Committee | కడియంపై వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు
- ●Chinas monster dam | నేపాల్ తరహాలో.. భారత్‌కు పొంచి ఉన్న చైనా "వాటర్ బాంబ్"
- ●ACB Raids | భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ రైడ్స్.. భారీగా ఆస్తులు..
- ●WhatsApp | వాట్సాప్ యూజర్లకు కొత్త సెక్యూరిటీ ఫీచర్లు.. ఇక అకౌంట్ మరింత సేఫ్..
- ●Ranabaali Movie | దసరా రేసులో విజయ్, రష్మిక ‘రణబాలి’ - రిలీజ్ డేట్ కన్ఫామ్

Tollywood | ఇండియన్ టాప్ 100 సెలిబ్రిటీస్ లిస్ట్‌లో అల్లు అర్జున్ , రామ్‌చరణ్ - టాలీవుడ్ నుంచి ఇద్దరికే చోటు!

Ethics Committee | కడియంపై వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు

Chinas monster dam | నేపాల్ తరహాలో.. భారత్‌కు పొంచి ఉన్న చైనా "వాటర్ బాంబ్"

ACB Raids | భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ రైడ్స్.. భారీగా ఆస్తులు..






