TG EAPCET Results | 11 గంటలకు ఈఏపీసెట్ ఫలితాలు.. ఇలా చెక్‌చేసుకోండి!
TG EAPCET Results | ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు (TG EAPCET Results) ఆదివారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి (TGCHE) జేఎన్‌టీయూలో (JNTUH) ఫలితాలను ప్రకటించనుంది.
TG EAPCET Results | త్రినేత్ర.న్యూస్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు (TG EAPCET Results) ఆదివారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి (TGCHE) జేఎన్‌టీయూలో (JNTUH) ఫలితాలను ప్రకటించనుంది. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా, TGCHE చైర్మన్ బాలకిష్టా రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఫలితాలు, ర్యాంక్ కార్డులు ఉదయం 11.15 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్ https://eapcet.tgche.ac.inలో అందుబాటులో ఉంటాయి. ప్రవేశ పరీక్షను ఈ నెల 9 నుంచి 11 వరకు నిర్వహించారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కు సుమారు 2.09 లక్షల మంది, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌కు 90 వేల మందికి పైగా అభ్యర్థులు రిజిస్టర్ అయ్యారు. పరీక్షకు 93 శాతానికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. కాగా, పరీక్ష నిర్వహించిన ఆరు రోజుల్లోనే ఫలితాలు వెలువడుతుండటం విశేషం.
ఇలా చెక్ చేసుకోండి..
1. అధికారిక వెబ్‌సైట్ eapcet.tgche.ac.in వెళ్లి.. TG EAPCET 2026 Results లింక్‌పై క్లిక్ చేయండి.
3. హాల్ టికెట్ నంబర్, ఇతర వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
4. ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండి, ప్రింట్ తీసుకోండి.
తాజావార్తలు
- ●TGEAPCET | బీ ఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఒకే విడతలో కౌన్సెలింగ్
- ●GV Narayana Rao | టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు నారాయణ రావు కన్నుమూత
- ●Kailash Mansarovar Yatra | ఆకస్మిక వరదలు.. తాత్కాలికంగా నిలిచిన కైలాస మానస సరోవర్ యాత్ర!
- ●Travels Bus | ఆటోను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఏడుగురి మృతి, మరో 8 మందికి గాయాలు
- ●సుస్మిత పొలిటికల్ ఎంట్రీ: కొండా మురళి 'ప్లాన్-బి' వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి?
- ●Horoscope | ఆగస్టు 27 రాశిఫలాలు.. ఈ రాశి వారు సవాళ్లను సులభంగా అధిగమిస్తారు!

TGEAPCET | బీ ఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఒకే విడతలో కౌన్సెలింగ్

GV Narayana Rao | టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు నారాయణ రావు కన్నుమూత

Kailash Mansarovar Yatra | ఆకస్మిక వరదలు.. తాత్కాలికంగా నిలిచిన కైలాస మానస సరోవర్ యాత్ర!

Travels Bus | ఆటోను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఏడుగురి మృతి, మరో 8 మందికి గాయాలు





