TG EAPCET | ఎప్‌సెట్‌లో హైదరాబాద్ విద్యార్థుల హవా..
TG EAPCET | తెలంగాణ ఈఏపీసెట్‌లో (TG EAPCET) హైదరాబాద్ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్‌తోపాటు అగ్రికల్చర్-ఫార్మసీ విభాగంలోనూ నగరానికి చెందిన విద్యార్థులే టాపర్లుగా నిలిచారు.
TG EAPCET | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ ఈఏపీసెట్‌లో (TG EAPCET) హైదరాబాద్ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్‌తోపాటు అగ్రికల్చర్-ఫార్మసీ విభాగంలోనూ నగరానికి చెందిన విద్యార్థులే టాపర్లుగా నిలిచారు. ఈ నెల 4 నుంచి 11 వరకు నిర్వహించిన ఎప్‌సెట్ ఫలితాలను (EAPCET Results) ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో ప్రతిభ కనబరిచిన టాప్ విద్యార్థుల జాబితాను ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగితా రానా, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన టాప్ 10 ర్యాంకర్ల జాబితాను సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన ప్రకటించారు.
ఇంజినీరింగ్ విభాగంలో ఉప్పల్‌కు చెందిన ఎం. రుషి అనే అమ్మాయి 156.63 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించగా, అగ్రికల్చర్-ఫార్మసీలో హైదరాబాద్‌కు చెందిన ఎం.అహ్మద్ టాప్ ర్యాంక్‌తో రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. ఇక ఇంజినీరింగ్‌లో మూసాపేటకు చెందిన బెజుగామ అన్షుల్ (148.70 మార్కులు) రెండో ర్యాంక్, ఏపీలోని పులివెందులకు చెందిన M. వంశీధర్‌రెడ్డి (147 మార్కులు) మూడో ర్యాంక్ కైవసం చేసుకున్నారు.
మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహించగా, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 9 నుంచి 11 వరకు జరిగాయి. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 1,97, 241 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 84,954 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇంజినీరింగ్‌లో 14,4704 మంది అంటే 73.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఇది 0.1 శాతం అధికం.
ఇంజినీరింగ్ టాపర్లు..
ఫస్ట్ ర్యాంక్- ఎం.రుషి (ఉప్పల్)
2వ ర్యాంక్- అన్షుల్ (మూసాపేట్)
3వ ర్యాంక్- ఎం.వంశీధర్‌రెడ్డి (పులివెందుల)
4వ ర్యాంక్- జె.రోషన్ మణిదీప్‌రెడ్డి (గుంటూరు)
5వ ర్యాంక్- ఎ. సాయినిఖిత్ (మహబూబ్‌నగర్)
6వ ర్యాంక్- ఎం.అస్నా (మేడ్చల్)
7వ ర్యాంక్- వి.శరద్ మహీశ్వరి (హైదరాబాద్)
8వ ర్యాంక్- టి.శ్రేయాస్‌రెడ్డి (హైదరాబాద్)
9వ ర్యాంక్- బి.సమీరాజ్‌రెడ్డి (రంగారెడ్డి)
10వ ర్యాంక్- ఆర్.జయంత్ శేఖర్ (మేడ్చల్)
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ..
1వ ర్యాంక్- ఎం.అహ్మద్ (హైదరాబాద్)-150.17 మార్కులు
2వ ర్యాంక్- తాడూరి నివృత్ సాయికిరణ్ (హైదరాబాద్)- 143.43 మార్కులు
3వ ర్యాంక్- సాహితి గీతిక గునిథి (రంగారెడ్డి)- 142.35 మార్కులు
4వ ర్యాంక్- మయుక్ జయసింహ (హైదరాబాద్)- 139.78 మార్కులు
5వ ర్యాంక్- అమైర్ అన్వాస్ (హైదరాబాద్)- 137.40 మార్కులు
6వ ర్యాంక్- నాథన్ షెబా జెరూష(సత్యసాయి జిల్లా)- 137.24 మార్కులు
7వ ర్యాంక్- పెరికేటి అనురాగ్ (తూర్పు గోదావరి)- 136.67 మార్కులు
8వ ర్యాంక్- బూర సాయిశరణ్(సూర్యాపేట)- 135.21 మార్కులు
9వ ర్యాంక్- ఎం.మారుతి సత్యశ్రీకర్(తూర్పు గోదావరి)
10వ ర్యాంక్- ఎం.రుతుంబిక (మేడ్చల్)
తాజావార్తలు
- ●PM Modi | 2036 ఒలింపిక్స్‌కు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి
- ●PM Modi | ఒలింపిక్స్‌లో భారత భాగస్వామ్యం పెరగాలి : ప్రధాని మోదీ
- ●Revanth Reddy | గవర్నర్‌కు సీఎం రేవంత్ పరామర్శ
- ●Nora Fatehi | ఆ వివాదం నన్ను తీవ్రంగా వేధించింది.. ఎన్నో అవకాశాలను కోల్పోయా : నోరా ఫతేహి
- ●Janhvi Kapoor | బాలీవుడ్ హీరోతో జాన్వీ కపూర్ పెళ్లంటూ రూమర్లు - ఫొటోల వెనకున్న అసలు ట్విస్ట్ ఇదే!
- ●Lunar Eclipse | ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం రేపే.. భారత్‌లో కనిపిస్తుందా..?

PM Modi | 2036 ఒలింపిక్స్‌కు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి

PM Modi | ఒలింపిక్స్‌లో భారత భాగస్వామ్యం పెరగాలి : ప్రధాని మోదీ

Revanth Reddy | గవర్నర్‌కు సీఎం రేవంత్ పరామర్శ

Nora Fatehi | ఆ వివాదం నన్ను తీవ్రంగా వేధించింది.. ఎన్నో అవకాశాలను కోల్పోయా : నోరా ఫతేహి





