త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGRJC CET 2026 | ‘ప‌ది’ విద్యార్థుల‌కు అల‌ర్ట్.. టీజీఆర్‌జేసీ సెట్-2026 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

TGRJC CET 2026 | మీరు ఈ ఏడాది ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేసుకుని, ఇంట‌ర్ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రంలో చేరాల‌నుకుంటున్నారా..? అది కూడా గురుకుల కాలేజీలో మీ ఇంట‌ర్ విద్య‌ను పూర్తి చేయాల‌నుకుంటున్నారా..? అయితే ఈ నోటిఫికేష‌న్.. ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న మీ లాంటి విద్యార్థుల కోస‌మే.

S

Telangana | Published On Mar 12, 2026, 6.55 pm IST

TGRJC CET 2026 | ‘ప‌ది’ విద్యార్థుల‌కు అల‌ర్ట్.. టీజీఆర్‌జేసీ సెట్-2026 నోటిఫికేష‌న్ విడుద‌ల‌
Advertisement

TGRJC CET 2026 | త్రినేత్ర‌.న్యూస్ : మీరు ఈ ఏడాది ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేసుకుని, ఇంట‌ర్ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రంలో చేరాల‌నుకుంటున్నారా..? అది కూడా గురుకుల కాలేజీలో మీ ఇంట‌ర్ విద్య‌ను పూర్తి చేయాల‌నుకుంటున్నారా..? అయితే ఈ నోటిఫికేష‌న్.. ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న మీ లాంటి విద్యార్థుల కోస‌మే.

రాష్ట్రంలోని 35 తెలంగాణ గురుకుల జూనియ‌ర్ కాలేజీల్లో ఇంట‌ర్ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రంలో ప్ర‌వేశాల కోసం టీజీఆర్‌జేసీ సెట్ -2026 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 2026-27 విద్యా సంవ‌త్స‌రానికి గానూ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్నారు. రాత ప‌రీక్ష ద్వారా ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్న‌ట్లు నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. పైకోర్సుల‌న్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చ‌ద‌వాల్సి ఉంటుంది.

అర్హ‌త‌లు ఇవే..

  • 2026 మార్చిలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థులు మాత్ర‌మే ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

ప్రవేశ పరీక్ష తేదీ

  • మే 03, 2026న TGRJC CET-2026 ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుంది.

దరఖాస్తు గడువు

  • ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 16, 2026 నుంచి ప్రారంభమై, ఏప్రిల్ 15, 2026 వరకు స్వీకరిస్తారు.

దరఖాస్తు రుసుము

  • అభ్యర్థులు రూ.200 దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం

  • ప్రవేశ పరీక్షలో కనబరిచిన ప్రతిభ & రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు చేయు విధానం

  • ఆసక్తి ఉన్న విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాల కోసం వెబ్‌సైట్‌లోని ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను చూడవచ్చు లేదా 040-24734899 ఫోన్ నంబర్‌ను సంప్రదించవచ్చునని సంస్థ కార్యదర్శి తెలిపారు.
Advertisement
Advertisement