త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tenth Results | తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌.. 95.15 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు

Tenth Results | తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఈ ఫ‌లితాల‌ను బుధ‌వారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కే కేశ‌వ‌రావు.. ఎల్బీ స్టేడియంకు ఎదురుగా ఉన్న ఎస్సీఈఆర్టీ ఆడిటోరియంలో విడుద‌ల చేశారు.

S

Telangana | Published On Apr 29, 2026, 2.05 pm IST

Tenth Results | తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌.. 95.15 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు
Advertisement

Tenth Results | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఈ ఫ‌లితాల‌ను బుధ‌వారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కే కేశ‌వ‌రావు.. ఎల్బీ స్టేడియంకు ఎదురుగా ఉన్న ఎస్సీఈఆర్టీ ఆడిటోరియంలో విడుద‌ల చేశారు. ఈ ఏడాది 95.15 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది.

మార్చి 14 నుంచి ప్రారంభమైన పరీక్షలు, ఏప్రిల్‌ 13న పూర్తయ్యాయి. పరీక్షలకు సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్​ విద్యార్థులు హాజరయ్యారు. మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయాల‌ని ఎస్సెస్సీ బోర్డు అధికారులు నిర్ణ‌యించారు. కానీ అనుకున్న స‌మ‌యానికి కంటే ముందే ఫ‌లితాలను విడుద‌ల చేశారు.

ఫ‌లితాల కోసం ఈ వెబ్‌సైట్ల‌ను సంప్ర‌దించండి..

results.bsetelangana.org
results.bse.telangana.gov.in
bse.telangana.gov.in
schooledu.telangana.gov.in

Advertisement
Advertisement