త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Assembly | అసెంబ్లీ ఆవ‌ర‌ణలో ఉద్రిక్త‌త‌.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను అడ్డుకున్న మార్ష‌ల్స్‌

Assembly | అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో (Assembly) మ‌రోసారి ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. స‌భా కార్య‌క‌లాపాల‌ను అడ్డుకోవ‌డంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ స‌మావేశాలు (Assembly Session) ముగిసేవ‌ర‌కు స‌స్పెండ్ చేశారు.

G

Telangana | Published On Sep 9, 2026, 11.51 am IST

Assembly | అసెంబ్లీ ఆవ‌ర‌ణలో ఉద్రిక్త‌త‌.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను అడ్డుకున్న మార్ష‌ల్స్‌
Advertisement

Assembly | త్రినేత్ర‌.న్యూస్‌: అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో (Assembly) మ‌రోసారి ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. స‌భా కార్య‌క‌లాపాల‌ను అడ్డుకోవ‌డంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ స‌మావేశాలు (Assembly Session) ముగిసేవ‌ర‌కు స‌స్పెండ్ చేశారు. దీంతో సస్పెన్ష‌న్‌కు గురైన ఎమ్మెల్యేలంతా (BRS MLAs) క‌లిసి త‌మ నిర‌స‌న తెలిపేందుకు, ప‌రిణామాల‌పై వివ‌రించేందుకు స్పీక‌ర్‌ను క‌ల‌వ‌డానికి బ‌య‌ల్దేరారు. స్పీక‌ర్ చాంబ‌ర్ (Speaker Chamber) వైపు వెళ్తుండ‌గా వారిని మార్ష‌ల్స్ అడ్డుకున్నారు. దీంతో అక్క‌డ‌ తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. బీఆర్ఎస్‌ ఎల్పీ (BRSLP) కార్యాల‌యంలో కూడా వెళ్లొద్దంటూ చీఫ్ మార్ష‌ల్ క‌రుణాక‌ర్ ఎమ్మెల్యేల‌ను అడ్డుకున్నారు. స‌స్పెండ్ అయ్యారు కాబ‌ట్టి వెళ్లేందుకు అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. మార్ష‌ల్స్ చ‌ర్య‌ను (Assembly Marshals) నిర‌సిస్తే అక్క‌డే ఆందోళ‌న‌కు దిగడంతో అసెంబ్లీ ఆవ‌ర‌ణలో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది.

అంత‌కుముందు స‌భ‌ను అడ్డుకుంటున్నార‌ని పేర్కొంటూ హ‌రీశ్ రావు, కేటీఆర్ స‌హా బీఆర్ఎస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేల‌పై స్పీక‌ర్ స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. ప్ర‌స్తుత స‌మావేశాలు ముగిసేవ‌కు స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. స‌స్పెండ్ అయిన‌వారిలో హరీశ్‌రావు, కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి, గంగుల, కౌశిక్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కోవా లక్ష్మి, మాణిక్‌రావు, చింతా ప్రభాకర్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్‌, విజయుడు, వివేకానంద, కె.సంజయ్‌, తలసాని, అనిల్ జాదవ్‌ ఉన్నారు. మ‌రోవైపు త‌మ‌కు మాట్లాడేందుకు అవ‌కాశం ఇవ్వ‌నందుకు గాను నిర‌స‌న‌గా శాస‌న మండ‌లి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు.

Advertisement
Advertisement