త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vinay Bhaskar | వ‌రంగ‌ల్ ఎంజీఎం వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త‌.. తోపులాట‌లో విన‌య్ భాస్క‌ర్ కంట‌త‌డి

Vinay Bhaskar | వ‌రంగ‌ల్‌ ఎంజీఎం (Warangal MGM Hospital) ఆసుపత్రి వద్ద తీవ్ర‌ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

S

Telangana | Published On Sep 22, 2026, 3.03 pm IST

Vinay Bhaskar | వ‌రంగ‌ల్ ఎంజీఎం వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త‌.. తోపులాట‌లో విన‌య్ భాస్క‌ర్ కంట‌త‌డి
Advertisement

Vinay Bhaskar | త్రినేత్ర‌.న్యూస్‌: వ‌రంగ‌ల్‌ ఎంజీఎం (Warangal MGM Hospital) ఆసుపత్రి వద్ద తీవ్ర‌ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గ‌త ఆదివారం ఎంజీఎం లోని ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడి రోగులు గాయపడిన పరిస్థితులు మరవకముందే మంగ‌ళ‌వారం మ‌రోసారి ఆర్ఐసీయూ (RICU) వార్డులో పై కప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. విష‌యం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే విన‌య్ భాస్క‌ర్ ఎంజీఎం లోప‌లికి వెళ్లి ప‌రిశీలించేందుకు య‌త్నించారు. ఈ క్ర‌మంలో గేటు వద్దే ఆయ‌న్ను పోలీసులు అడ్డుకోవ‌డంతో వారిని తోసుకుంటూ బీఆర్ఎస్ శ్రేణులు లోప‌లికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో ఇరువురి మ‌ధ్య తీవ్ర తోపులాట జ‌రిగింది. సీఎం డౌన్ డౌన్ అంటూ స్లొగన్స్ ఇవ్వడంతో ఒక్క‌సారిగా వాడీవేడీ వాతావరణం నెలకొన్నది.

చేయి విరిగిందంటూ కంటతడి..

ఎంజీఎం ఆసుపత్రిలో పెచ్చులు ఊడి గాయాలైన రోగుల పరిస్థితి తెలుసుకునేందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ వెళ్తుండ‌గా పోలీసులు అడ్డుకున్నారు. తోపులాట సంద‌ర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ తీవ్ర అస‌హ‌నానికి గుర‌య్యారు. పోలీసులు కొడుతున్నార‌ని, త‌న చేయి విరిగిందంటూ వ్యాఖ్యానించారు. దీంతో పాటు పోలీసులు కడుపులో తన్నారని వినయ్ భాస్కర్ క‌న్నీటి ప‌ర్యంత‌మయ్యారు. మ‌రోవైపు కాలు, చేతి నుంచి రక్తం కారుతున్న‌ట్లు స్థానికంగా ఉన్న‌వారు తెలియ‌జేశారు. కాగా స్థానికంగా ఉన్న రోగుల స‌హాయ‌కులు పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిని చూడొద్దా అంటూ పోలీసుల‌ను ముక్కుసూటిగా నిలదీశారు.

ప్ర‌శ్నించే గొంతుల‌ను అణిచివేయ‌డ‌మే..

అడుగ‌డుగునా పోలీసులు అడ్డుకున్న‌ప్ప‌టికీ నిర్బంధాల‌ను ఛేదించుకుని ఎట్ట‌కేల‌కు ఎంజీఎం ఆస్ప‌త్రిని సంద‌ర్శించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. ప్రశ్నించే గొంతులను అణిచివేయడమే కాంగ్రెస్ ప్రజాపాలనా అని మండిప‌డ్డారు. పేద ప్రజలకు కనీస వైద్యం అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటూ దుయ్యబ‌ట్టారు. ప్రజా పాలన అని చెప్పి ప్రజల ప్రాణాలను పట్టించుకోని నిర్లక్ష్య ప్రభుత్వమని ఫైర‌య్యారు. రోగులకు సరిపడా లేని బెడ్లు లేవ‌ని.. పెచ్చులూడుతున్నా భవనం పైకప్పులను, అంబులెన్స్ కొరతను ఈ పాలకులు గత మూడేళ్లుగా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్య‌క్తం చేశారు. ఎంజీఎంను సందర్శించనియ్యకపోవడం నిరంకుశ పాలనకు నిదర్శనమ‌న్నారు. ఈ సంద‌ర్భంగా రోడ్డుపై బైఠాయించి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిరసన వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement