BRS USA | తెలంగాణ ఆత్మగౌరవమే మా అజెండా.. రాష్ట్ర అభివృద్ధే మా లక్ష్యం: బీఆర్ఎస్ యూఎస్ఏ
BRS USA | తెలంగాణ ఆత్మగౌరవమే తమ అజెండా అని.. రాష్ట్ర అభివృద్ధే తమ లక్ష్యంమని బీఆర్ఎస్ యూఎస్ఏ ప్రతినిధులు పేర్కొన్నారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 1000 మంది తెలంగాణవాదులు, BRS USA ప్రతినిధులు తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులర్పించి, అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
- అమెరికాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
BRS USA | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ ఆత్మగౌరవమే తమ అజెండా అని.. రాష్ట్ర అభివృద్ధే తమ లక్ష్యంమని బీఆర్ఎస్ యూఎస్ఏ ప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 1000 మంది తెలంగాణవాదులు, BRS USA ప్రతినిధులు వర్చువల్‌గా జూమ్ సమావేశం నిర్వహించారు. శ్రీధర్‌రెడ్డి, మహేశ్ తన్నీరు, తిరుపతి రెడ్డి, భాస్కర్, అల్లం కృష్ణ, నర్సింహారావు, రజనీకాంత్, శ్రీనివాస్ జక్కిరెడ్డి తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులర్పించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు. వక్తలు మాట్లాడుతూ తెలంగాణను అవమానించే ప్రతి వ్యాఖ్యను ప్రజాస్వామ్యబద్ధంగా, ధైర్యంగా, వాస్తవాలతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
వక్తలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యత అని పేర్కొన్నారు. ఇటీవల కొందరు వ్యక్తులు తెలంగాణ చరిత్రను, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అనే పదమే లేదని, తెలంగాణ భావజాలాన్ని అవమానించేలా మాట్లాడే వారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సింహాల్లా ఆత్మగౌరవం కాపాడుకోవాలి..
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు అవమానకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రజల దశాబ్దాల పోరాట ఫలితమన్నారు. అమరవీరుల త్యాగాల ఫలితమని, దాన్ని కించపరిచే వ్యాఖ్యలను తెలంగాణ సమాజం ఎప్పటికీ సహించదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు ఇకపై ఎవరి ముందు తలవంచే పరిస్థితిలో లేరని.. ప్రతి తెలంగాణ బిడ్డ ఒక సింహంలా తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు.
కేసీఆర్ నాయకత్వం అవసరం..
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం విజయవంతమై రాష్ట్రం సిద్ధించిందన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన తెలంగాణను అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. భవిష్యత్తులో కూడా తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. “నా తెలంగాణ కోటి రతణాల వీణ” అని మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు చెప్పిన మాటలు నేటికీ ప్రతి తెలంగాణ బిడ్డ హృదయంలో మారుమోగుతూనే ఉన్నాయని గుర్తు చేశారు.
పార్టీకి సంపూర్ణ మద్దతు..
అమెరికాలోని అట్లాంట, డల్లాస్, హ్యూస్టన్, ఆస్టిన్, చికాగో, న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, ఫొనిక్స్, ఫిలడెల్పియా, సాన్ ఆంటోనియో, సాండియాగో, బోస్టన్, కొలంబస్, వర్జీనియా, బర్మింగ్‌హామ్ తదితర ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ యూఎస్ఏ సభ్యులు పాల్గొని పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధి, ఆత్మగౌరవ పరిరక్షణ, ప్రజా సంక్షేమం కోసం మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | తెలంగాణ మా అయ్య జాగీరే.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు పొన్నం కౌంటర్..!
జూన్ 2, 2026

KTR | రేవంత్ రెడ్డికి రోషం లేదు.. నాలుగు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన నయవంచకుడు : కేటీఆర్
జూన్ 2, 2026

Pawan Kalyan | 2029 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ చేస్తుంది.. పవన్ కల్యాణ్ ప్రకటన
జూన్ 2, 2026
తాజావార్తలు
- ●Buchi Babu Sana | పెద్ది ఎన్టీఆర్ కోసం రాసిన కథ కాదు...చిరంజీవి తిడతారనుకున్నా - పెద్దిపై బుచ్చిబాబు సానా కామెంట్స్
- ●Nepal PM Balen Shah | 'మేమూ ఇండియాలోకి చొరబడ్డాం'.. నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. భగ్గుమన్న విపక్షాలు, విద్యార్థులు
- ●Kajal Aggarwal | కాజల్ అగర్వాల్ హాట్ ఫొటోషూట్ - ఆఫర్ల కోసమేనా?
- ●Kavitha | మిలియన్ మార్చ్‌ను తలపించేలా భూ పోరాటం : కవిత
- ●Ponnam Prabhakar | తెలంగాణ మా అయ్య జాగీరే.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు పొన్నం కౌంటర్..!
- ●Keerthy Suresh | రూటు మార్చిన మహానటి - బాలీవుడ్ మూవీలో బోల్డ్ రోల్

Buchi Babu Sana | పెద్ది ఎన్టీఆర్ కోసం రాసిన కథ కాదు...చిరంజీవి తిడతారనుకున్నా - పెద్దిపై బుచ్చిబాబు సానా కామెంట్స్

Nepal PM Balen Shah | 'మేమూ ఇండియాలోకి చొరబడ్డాం'.. నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. భగ్గుమన్న విపక్షాలు, విద్యార్థులు

Kajal Aggarwal | కాజల్ అగర్వాల్ హాట్ ఫొటోషూట్ - ఆఫర్ల కోసమేనా?

Kavitha | మిలియన్ మార్చ్‌ను తలపించేలా భూ పోరాటం : కవిత



