త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

YISU | యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీలో బీటెక్, బీఎస్సీ కోర్సులు.. అర్హులు వీరే..!

YISU | మీరు ఇంట‌ర్( Inter ) పాస‌య్యారా..? బీటెక్‌లో అప్లైడ్ లైఫ్ సైన్సెస్( Applied Life Sciences ) కోర్సులు, బీఎస్సీలో కార్డియోవాస్కుల‌ర్ సైన్సెస్( Cardiovascular Sciences ) కోర్సులు చేయాల‌నుకుంటున్నారా..? అయితే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీ( Young India Skills University ) ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు వివ‌రాలు ఇవే.

S

Telangana | Published On Apr 8, 2026, 6.31 pm IST

YISU | యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీలో బీటెక్, బీఎస్సీ కోర్సులు.. అర్హులు వీరే..!
Advertisement

YISU | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ప్ర‌భుత్వం కొత్త‌గా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీ( Young India Skills University )లో బీటెక్, బీఎస్సీ కోర్సుల‌ను ప్రారంభిస్తున్న‌ట్లు బుధ‌వారం యూనివ‌ర్సిటీ యాజ‌మాన్యం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అప్లైడ్ లైఫ్ సైన్సెస్‌( Applied Life Sciences ) లో బీటెక్ కోర్సులు, కార్డియోవాస్కుల‌ర్ సైన్సెస్‌( Cardiovascular Sciences )లో బీఎస్సీ కోర్సుల‌ను ప్రారంభించిన‌ట్లు పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా యూనివ‌ర్సిటీ వీసీ వీఎల్‌వీఎస్ఎస్ సుబ్బారావు మాట్లాడుతూ.. డాక్ట‌ర్ రెడ్డీస్ లాబోరేట‌రీస్, హెటిరో, భార‌త్ బ‌యోటెక్ ఆధ్వ‌ర్యంలో బీటెక్ అప్లైడ్ లైఫ్ సైన్సెస్ కోర్సుల‌ను నిర్వ‌హిస్తున్నాం. ఈ కోర్సుకు సంబంధించి మొద‌టి సెమిస్ట‌ర్‌కు మాత్ర‌మే క్లాస్ రూమ్ శిక్ష‌ణ ఉంటుంది. మిగతా సెమిస్ట‌ర్ల‌కు కంపెనీల ఆధ్వ‌ర్యంలో శిక్ష‌ణ అందించ‌నున్నారు. ఇక బీఎస్సీ కార్డియోవాస్కుల‌ర్ సైన్సెస్ కోర్సును ఏఐజీ హాస్పిట‌ల్స్ ఆధ్వ‌ర్యంలో అందించ‌నున్న‌ట్లు వీసీ తెలిపారు.

బీటెక్ కోర్సుకు అర్హ‌త‌లు ఇవే

అర్హ‌త : ఇంట‌ర్ పాసై ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ కాంబినేష‌న్ లేదా బ‌యోసైన్స్ విత్ మ్యాథ్స్ కోర్సులు చేసి ఉండాలి. ఇంట‌ర్‌లో త‌ప్ప‌నిసరిగా 55 శాతం మార్కులు సాధించాలి.
ఎంపిక : యూనివ‌ర్సిటీ ఎగ్జామ్ నిర్వ‌హిస్తుంది. దీంతో పాటు వ్య‌క్తిగ‌త ఇంట‌ర్వ్యూ కూడా నిర్వ‌హించ‌నున్నారు.
ఫీజు : రూ. 1,75,000
కాల వ్య‌వ‌ధి : నాలుగేండ్లు(8 సెమిస్ట‌ర్లు)
సీట్ల సంఖ్య : 30
ద‌ర‌ఖాస్తు ఫీజు : రూ. 2000

బీఎస్సీ కార్డియోవాస్కుల‌ర్ కోర్సు అర్హ‌త‌లు ఇవే..

అర్హ‌త : బొట‌నీ, జువాల‌జీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాంబినేష‌న్‌లో ఇంట‌ర్ 55 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి.
ఎంపిక : యూనివ‌ర్సిటీ ఎగ్జామ్ నిర్వ‌హిస్తుంది. దీంతో పాటు వ్య‌క్తిగ‌త ఇంట‌ర్వ్యూ కూడా నిర్వ‌హించ‌నున్నారు.
ఫీజు : రూ. 1,00,000 (ఏడాదికి)
కాల వ్య‌వ‌ధి : మూడేండ్లు
ప్రోగ్రామ్ లొకేష‌న్ : ఏఐజీ హాస్పిట‌ల్స్(గ‌చ్చిబౌలి)
సీట్ల సంఖ్య : 50
ద‌ర‌ఖాస్తు ఫీజు : రూ. 2000

బీటెక్ కోర్సుల ద‌ర‌ఖాస్తుల‌కు ఈ లింక్‌ను క్లిక్ చేయండి..

https://yisu.in/courses/btech-applied-life-sciences-technology

బీఎస్సీ కోర్సుల ద‌ర‌ఖాస్తుల‌కు ఈ లింక్‌ను క్లిక్ చేయండి..

https://yisu.in/courses/cardiovascular-science-bsc

Advertisement
Advertisement