Un Employees | మా కంటే అర్జంట్ పనేం ఉంటది సర్.. కోదండరాంను నిలదీసిన నిరుద్యోగులు
Un Employees | కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు నిరుద్యోగుల నుంచి నిరసన వ్యక్తమైంది. మీరు చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాం.. ఇప్పుడెందుకు మా తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని కోదండరాంను నిరుద్యోగులు నిలదీశారు.
Un Employees | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు నిరుద్యోగుల నుంచి నిరసన వ్యక్తమైంది. మీరు చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాం.. ఇప్పుడెందుకు మా తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని కోదండరాంను నిరుద్యోగులు నిలదీశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంచే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కోదండరాంను నిరుద్యోగ అభ్యర్థులు అడ్డుకుని నిలదీశారు.

మీరు 60 ఏళ్లకు సుప్రీంకోర్టుకు వెళ్లి ఎమ్మెల్సీ కావొచ్చు కానీ, మేము 30 ఏళ్లకు ఉద్యోగం చేయడానికి పనికిరామా? అని ఆయనను ప్రశ్నించారు. మీ మాటలు నమ్మి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించాము, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పట్టించుకోకపోతే ఎందుకు మౌనంగా ఉన్నారు? ప్రభుత్వ ఉద్యోగ నియామక నోటిఫికేషన్లకు అభ్యర్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని నిరుద్యోగులు గుర్తు చేశారు. గ్రామీణ విద్యార్థులు రూ. 1500 ఫీజు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్లకు అభ్యర్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయమని మాట తప్పారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు వయోపరిమితి తగ్గించాలని డిమాండ్ చేశారు. మీడియా కూడా మా సమస్యలను కవర్ చేయడం లేదు, మా సమస్యలను కవర్ చేయమని మీడియాకు చెప్పండి అంటూ కోదండరాంను నిలదీశారు. నిరుద్యోగుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కోదండరాం.. తనకు అర్జంట్ పని ఉందంటూ అక్కడ్నుంచి నిష్క్రమించే ప్రయత్నం చేశారు. మా కంటే అర్జంట్ పని ఏం ఉంటది సర్ అంటూ నిరుద్యోగులు ప్రశ్నల వర్షం కురిపించారు.
మీరు 60 ఏళ్లకు సుప్రీంకోర్టుకు వెళ్లి ఎమ్మెల్సీ కావొచ్చు కానీ, మేము 30 ఏళ్లకు ఉద్యోగం చేయడానికి పనికిరామా?
ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు నిరసన సెగ
మీరు చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము, ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు?
కోదండరాంను అడ్డుకుని నిలదీసిన నిరుద్యోగులు, సమాధానం… pic.twitter.com/He5j4g1Laa
— Telugu Scribe (@TeluguScribe) August 12, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jagadeesh Reddy | నాగార్జునసాగర్ నిండేదాక పోతిరెడ్డిపాడు గేట్లు బంద్ చేయాలి.. రేవంత్‌కు అలా అడిగే దమ్ముందా?
- ●bans sale of gutka | ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గుట్కా, పాన్ మసాలాలపై నిషేధం
- ●realme 16x 5G | 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లే.. రియల్‌మి 16ఎక్స్ 5జి ఫోన్ లాంచ్..
- ●Bank Account | కేవైసీ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందా..? సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత..?
- ●Harish Rao | రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా..?
- ●Amit Shah | చర్చకు నేను సిద్ధం.. విపక్షాలకు అమిత్ షా సవాల్

Jagadeesh Reddy | నాగార్జునసాగర్ నిండేదాక పోతిరెడ్డిపాడు గేట్లు బంద్ చేయాలి.. రేవంత్‌కు అలా అడిగే దమ్ముందా?

bans sale of gutka | ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గుట్కా, పాన్ మసాలాలపై నిషేధం

realme 16x 5G | 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లే.. రియల్‌మి 16ఎక్స్ 5జి ఫోన్ లాంచ్..

Bank Account | కేవైసీ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందా..? సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత..?




