త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Police | ప్రాణాలు కాపాడిన డయల్ 112 కాల్…

Telangana Police | కుటుంబ కలహాల నేపథ్యంలో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి నవంబర్ 12వ తేదీ రాత్రి 10:35 గంటల సమయంలో ఇంట్లో తలుపులు వేసుకొని ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

S

Telangana | Published On Nov 13, 2026, 4.06 pm IST

Telangana Police | ప్రాణాలు కాపాడిన డయల్ 112 కాల్…
Advertisement

Telangana Police | త్రినేత్ర న్యూస్ : కుటుంబ కలహాల నేపథ్యంలో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి నవంబర్ 12వ తేదీ రాత్రి 10:35 గంటల సమయంలో ఇంట్లో తలుపులు వేసుకొని ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై డయల్ 112కు సమాచారం అందడంతో బ్లూకోల్ట్ సిబ్బంది కానిస్టేబుల్ రమేష్, హోంగార్డు మైసయ్య వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో ఉన్న సంతోష్‌ను గమనించిన సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి, సమయస్ఫూర్తితో చీరను కత్తిరించి అతడిని కిందకు దించి ప్రాణాపాయం నుంచి రక్షించారు. అనంతరం తక్షణ వైద్య సహాయం అందేలా చర్యలు చేపట్టారు. సకాలంలో స్పందించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ రమేష్, హోంగార్డు మైసయ్యలను స్థానిక ప్రజలు అభినందించారు.

Advertisement
Advertisement