CM Revanth Reddy | రాహుల్ నాయకత్వంలో దేశాన్ని కాపాడుకుందాం
CM Revanth Reddy | దేశం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారని, ఆయన నాయకత్వానికి మనందరం మద్దతుగా నిలబడాలని, దేశాన్ని కాపాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచంలో మమ్మల్ని ఏ శక్తి కూడా ఆపలేదని ఆయన దీమా వ్యక్తం చేశారు.
మేం గొప్ప లక్ష్యం పోరాడుతున్నాం..
ప్రపంచంలో మమ్మల్ని ఏ శక్తి ఆపలేదు
మమ్మల్ని ఆపగలుగుతామనుకోవడం వారి భ్రమ మాత్రమే
భారత్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : దేశం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారని, ఆయన నాయకత్వానికి మనందరం మద్దతుగా నిలబడాలని, దేశాన్ని కాపాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచంలో మమ్మల్ని ఏ శక్తి కూడా ఆపలేదని ఆయన దీమా వ్యక్తం చేశారు. భారత్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణకు, అద్భుతమైన రాజధాని నగరం హైదరాబాద్‌కు మీ అందరికీ స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా ఒకే ఆలోచనా ధోరణి కలిగిన వ్యక్తులను, ప్రభావశీలురను ఒకే వేదికపైకి తీసుకురావడానికి భారత్ సమ్మిట్ గొప్ప వేదిక. 70 దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులను మేము ఆహ్వానించాం. అయితే కేంద్ర ప్రభుత్వం వారిలో చాలామందికి వీసాలను రద్దు చేసింది. అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారు మనల్ని గమనిస్తున్నారని నేను నమ్ముతున్నాను. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని జరుపుకుంటున్న ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. భారతదేశంలో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావడానికి నెహ్రూ దార్శనికత ఎంతో దోహదపడింది అని సీఎం తెలిపారు.

రైతులతో సహా ప్రతి ఒక్కరినీ రక్షించాలని కోరుకుంటున్నాం
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం రెండు శక్తుల మధ్య పోరాటం జరుగుతోంది. ఒక శక్తి ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంటే, మరో శక్తి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని చూస్తోంది. మేము రాజ్యాంగం, చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉన్నాం. కానీ వారు రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి, నియంతృత్వాన్ని రుద్దాలని చూస్తున్నారు. ప్రతి పౌరుడికీ ఓటు హక్కు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ వారు తమకు నచ్చిన కొన్ని వర్గాలకే ఓటు హక్కు కల్పించాలని చూస్తున్నారు. మేము పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. కానీ వారు పర్యావరణాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా పేదలు, మహిళలు, మైనారిటీలు, రైతులతో సహా ప్రతి ఒక్కరినీ రక్షించాలని మేము కోరుకుంటున్నాం. కానీ వారు తమ సంపన్న మిత్రులను మాత్రమే కాపాడుకోవాలని చూస్తున్నారు. అందరికీ సమాన అవకాశాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ వారు కొద్దిమంది చేతుల్లోనే అధికారాన్ని కేంద్రీకరించాలని చూస్తున్నారు. మేము చర్చలు, సంప్రదింపులను కోరుకుంటున్నాం. కానీ వారు ఒకే వ్యక్తి నుంచి ఆదేశాలు రావాలని కోరుకుంటున్నారు. మమ్మల్ని ఆపగలమని వారు భావిస్తున్నారు. కానీ అది వారి భ్రమ మాత్రమే. మేము ఒక గొప్ప లక్ష్యం కోసం పోరాడుతున్నంత కాలం ప్రపంచంలోని ఏ శక్తీ మమ్మల్ని ఆపలేదు అని సీఎం దీమా వ్యక్తం చేశారు.
ప్రభుత్వాలు సామాన్య ప్రజల కోసం పనిచేయాలి
ప్రపంచీకరణ, కోవిడ్ తర్వాత అన్ని దేశాలు దాదాపు ఒకే రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ప్రాథమిక హక్కులపై దాడులు, విద్య, ఉపాధి, వైద్య సేవలు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలు అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. ప్రపంచంలోని చాలా దేశాల ప్రజల కలలు, ఆకాంక్షలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. లక్షలాది మంది ప్రజలు తమ ఆకాంక్షలను అర్థం చేసుకోవాలని, వారి సమస్యలను వినాలని, వారి కలలను సాకారం చేయాలని మనపై ఆశలు పెట్టుకున్నారు. మనపై ఎంతో గొప్ప బాధ్యత ఉంది. మనమందరం కలిసికట్టుగా పోరాడితే విజయం సాధిస్తాం. మన నాయకుడు రాహుల్ గాంధీ దేశంలో ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నారు. ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కల్పించడం కోసం ఆయన పోరాడుతున్నారు. దళితులు, మైనారిటీలు, ఓబీసీలకు సామాజిక న్యాయం కల్పించడం కోసం ఆయన పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో మనమందరం రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలి. ఆయన నాయకత్వంలో మనం ఈ మార్పును తీసుకువస్తాం. ప్రభుత్వం సంపన్నుల కోసం పనిచేయడం మానుకోవాలి. ప్రభుత్వాలు సామాన్య ప్రజల కోసం పనిచేయాలి. ప్రపంచవ్యాప్తంగా మనమందరం ఒకే రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నాం. అందరం కలిసి పోరాడుదాం. రాహుల్ నాయకత్వంలో ఈ ఆలోచనలతో మన దేశాన్ని కాపాడుకుందాం. 70 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఈ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తే, మనం కోరుకుంటున్న మార్పును తీసుకురాగలం. ఈ గొప్ప లక్ష్యం కోసం మనమందరం చేతులు కలిపి పోరాడుదాం అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
సంబంధిత వార్తలు

DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం
నవంబర్ 15, 2026

Bharat Summit Hyderabad Visa Row | అప్పుడు రేవంత్ టూర్.. ఇప్పుడు హైదరాబాద్ ‘భారత్ సమ్మిట్’! మళ్లీ తెరపైకి వీసా వివాదం
నవంబర్ 14, 2026

Road Accident | డివైడర్‌ను ఢీకొట్టి అంటుకున్న కారు.. డ్రైవర్ బయటికొచ్చేలోపే ఏం జరిగిందంటే!
నవంబర్ 14, 2026
తాజావార్తలు
- ●DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం
- ●Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!
- ●Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం
- ●Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!
- ●Nariman House | యూదులే లక్ష్యంగా నారిమన్ హౌస్ వద్ద రెక్కీ.. 20 ఏండ్ల యువకుడు అరెస్ట్
- ●Flight Outage | అమెరికాలో నిలిచిన విమాన సేవలు.. సాయంత్రానికి సాధారణ స్థితికి!

DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం

Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!

Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం

Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!



