Cherlapally Jail | ఖైదీలకు వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ.. చర్లపల్లి జైలులో ఐటీఐ
Cherlapalli Jail | జైళ్లను నిర్బంధ కేంద్రాలుగా కాకుండా విద్య, నైపుణ్యాభివృద్ధి, పునరావాస కేంద్రాలుగా ప్రభుత్వం తీర్చిదిద్దతున్నది. ఇందులో భాగంగా ఖైదీలకు వృత్తివిద్యాకోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకై ఐటీఐలను (ITI) ఏర్పాటు చేస్తున్నది. తొలిసారిగా చర్లపల్లి జైలులో (Cherlapalli Jail) ఏర్పాటు చేసిన ఐటీఐని జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్రా ప్రారంభించారు.
Cherlapalli Jail | త్రినేత్ర న్యూస్: జైళ్లను నిర్బంధ కేంద్రాలుగా కాకుండా విద్య, నైపుణ్యాభివృద్ధి, పునరావాస కేంద్రాలుగా ప్రభుత్వం తీర్చిదిద్దతున్నది. ఇందులో భాగంగా ఖైదీలకు వృత్తివిద్యాకోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకై ఐటీఐలను (ITI) ఏర్పాటు చేస్తున్నది. తొలిసారిగా చర్లపల్లి జైలులో (Cherlapalli Jail) ఏర్పాటు చేసిన ఐటీఐని జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్రా ప్రారంభించారు. ఒక్కో బ్యాచ్‌లో 200 మంది అభ్యర్థులకు శిక్షణ అందించనున్నారు. ఫిట్టర్, పెయింటర్ (జనరల్), వీవింగ్ టెక్నీషియన్, వుడ్ వర్క్ టెక్నీషియన్, వెల్డర్, డ్రెస్ మేకింగ్, హౌస్ కీపర్, హార్టికల్చర్, ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్ వంటి కోర్సుల్లో ఖైదీలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా డీజీ సౌమ్యామిశ్రా (Soumya Mishra) మాట్లాడుతూ.. తెలంగాణ జైళ్ల చరిత్రలో తొలిసారిగా ఖైదీల కోసం ప్రత్యేక ఐటీఐని ప్రారంభించడం ఎంతో సంతోషకరన్నారు. ఒక్కో బ్యాచ్‌లో 200 మంది అభ్యర్థులకు సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చేలా దీనిని తీర్చిదిద్దామని చెప్పారు. ఫిట్టర్, పెయింటర్, వీవింగ్ టెక్నీషియన్, వుడ్‌వర్క్ వంటి ఉపాధి ఆధారిత కోర్సులకు ఆమోదం లభిందని తెలిపారు. దీనిద్వారా జైలు ఆవరణలోనే ఖైదీలకు నాణ్యమైన సాంకేతిక విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు.
ఇటీవల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) ద్వారా 78 మంది ఖైదీలు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని సౌమ్య మిశ్రా తెలిపారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీతో (Telangana Open School Society) ఎంఓయూ కుదుర్చుకున్న అనంతరం 70 మంది ఖైదీలు పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరారని వెల్లడించారు. విద్యార్హతలు పూర్తి చేసే ఆసక్తి కలిగిన ఖైదీలను ఐటీఐ కోర్సులు అభ్యసించేలా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. విద్యతోపాటు వృత్తి నైపుణ్య శిక్షణను అనుసంధానం చేయడం ద్వారా ఖైదీలకు విడుదల అనంతరం ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. వారు నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వావలంబన కలిగిన పౌరులుగా సమాజంలో తిరిగి స్థిరపడేందుకు దోహదపడుతుందని ఆమె వివరించారు.
స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కల్పించడంలో నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్య కీలక పాత్ర పోషిస్తాయని శక్తి శాఖ కార్యదర్శి దాసరి హరిచందన (Dasari Hari Chandana) అన్నారు. గుర్తింపు పొందిన ఐటీఐ కోర్సులను పూర్తి చేసిన ఖైదీలు తమ నైపుణ్యాలు, అర్హతలను అనుసరించి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను పొందవచ్చని చెప్పారు.
తాజావార్తలు
- ●U19 Asia Cup 2026 | ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్ సంచలన విజయం
- ●Satvika Veeravalli | ఇంజినీర్ నుంచి హీరోయిన్గా - "కాంత" కోసం ఆడిషన్ ఇచ్చా కానీ - సాత్విక వీరవల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ●Road Accident | డివైడర్‌ను ఢీకొట్టి అంటుకున్న కారు.. డ్రైవర్ బయటికొచ్చేలోపే ఏం జరిగిందంటే!
- ●BM Sandeep | తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జిగా బీఎం సందీప్
- ●Vemulawada | రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశం
- ●Naaz Anjum Hyderabad | రూ.80 పెట్టుబడితో మొదలై నెలకు రూ.లక్ష సంపాదన.. హైదరాబాద్ 'బిర్యానీ క్వీన్' నాజ్ అంజుమ్ సక్సెస్ స్టోరీ!

U19 Asia Cup 2026 | ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్ సంచలన విజయం

Satvika Veeravalli | ఇంజినీర్ నుంచి హీరోయిన్గా - "కాంత" కోసం ఆడిషన్ ఇచ్చా కానీ - సాత్విక వీరవల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Road Accident | డివైడర్‌ను ఢీకొట్టి అంటుకున్న కారు.. డ్రైవర్ బయటికొచ్చేలోపే ఏం జరిగిందంటే!

BM Sandeep | తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జిగా బీఎం సందీప్






