Telangana | ఉప సర్పంచ్‌లకు ఊరట.. చెక్ పవర్ రద్దుపై పంచాయతీ రాజ్ శాఖ స్పష్టత
Telangana | రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఉప సర్పంచ్‌లను ఉక్కిరిబిక్కిరి చేసింది. నిన్న కొత్తగా ఉప సర్పంచ్‌లుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి కాసేపు గుండెల్లో దడ పుట్టించింది. ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు చేస్తున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Gram Panchayat
Telangana | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఉప సర్పంచ్‌లను ఉక్కిరిబిక్కిరి చేసింది. నిన్న కొత్తగా ఉప సర్పంచ్‌లుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి కాసేపు గుండెల్లో దడ పుట్టించింది. ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు చేస్తున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్షణాల్లోనే ఈ ఉత్తర్వులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో మొదట జారీ చేసిన ఉత్తర్వులను సవరిస్తూ.. నిమిషాల వ్యవధిలోనే మరో మెమో విడుదల చేసింది పంచాయతీ రాజ్ శాఖ.
ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు చేయలేదంటూ.. అధికారుల తప్పిదం వల్లే జరిగిందని పంచాయతీ రాజ్ శాఖ వివరణ ఇచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిరిగానే ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సవరణ చేస్తూ పంచాయతీ రాజ్ శాఖ కొత్త మెమోను విడుదల చేసింది.
ఉప సర్పంచ్ పోస్టుకు ఎందుకంత డిమాండ్..?
2025 పంచాయతీ ఎన్నికల్లో ఉప సర్పంచ్ పోస్టుకు భారీ డిమాండ్ ఉండే. ఎందుకంటే జాయింట్ చెక్ పవర్ ఉండడమే ప్రధాన కారణం. అంటే సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకం చేస్తేనే బిల్లులు మంజూరీకి అవకాశం ఉండే. లక్షలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచి, ఉప సర్పంచ్ పదవిని దక్కించుకున్నామని, తీరా చూస్తే తమ ఆశలపై నీళ్లు చల్లారని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ సవరణ చేయడంతో ఉప సర్పంచ్‌లు ఊపిరి పీల్చుకున్నారు.
జాయింట్ చెక్ పవర్ అంటే..?
ఈ విధానంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం, గ్రామాభివృద్ధి పనులకు సంబంధించి నిధుల విడదల, చెల్లింపుల విషయంలో సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు కూడా సమానమైన బాధ్యత ఉంటుంది. దీనినే సాధారణంగా 'జాయింట్ చెక్ పవర్' అని పిలుస్తారు.
2018 నుంచి ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్
2014లో అధికారంలోకి వచ్చిన నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం.. 2018లో కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చింది. ఆ చట్టంలో సర్పంచ్, ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ కల్పించింది. 2019 జనవరి నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల అనంతరం జాయింట్ చెక్ పవర్ విధానం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది.
2018కు ముందు ఇలా..
2018 పంచాయతీ రాజ్ చట్టానికి ముందు.. గ్రామ పంచాయతీల నిధుల చెల్లింపుల కోసం సర్పంచ్‌తో పాటు పంచాయతీ కార్యదర్శి సంతకాలు అవసరమయ్యేవి. అయితే, అధికారుల కంటే ప్రజల చేత ఎన్నికైన ప్రతినిధులకే ఎక్కువ బాధ్యత ఉండాలనే ఉద్దేశంతో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు చెక్ పవర్ తీసేసి, వారి స్థానంలో ఉప సర్పంచ్‌లకు అవకాశం కల్పించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



