Ponnam Prabhakar | ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాలుక జాగ్రత్త పెట్టుకో.. మంత్రి పొన్నం హెచ్చరిక
Ponnam Prabhakar | రాష్ట్ర విద్యాశాఖలో రూ. 2 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. తాడు బొంగరం లేని ఆర్ఎస్పీ చర్చకు వస్తామంటే కుదరదు.. కేసీఆర్‌తో సహా మాజీ మంత్రులందరూ శాసనసభకు వస్తే చర్చ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పొన్నం ప్రభాకర్ సూచించారు.
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర విద్యాశాఖలో రూ. 2 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. తాడు బొంగరం లేని ఆర్ఎస్పీ చర్చకు వస్తామంటే కుదరదు.. కేసీఆర్‌తో సహా మాజీ మంత్రులందరూ శాసనసభకు వస్తే చర్చ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పొన్నం ప్రభాకర్ సూచించారు. ఇకనైనా ఆర్ఎస్పీ ఒళ్లు, నాలుక జాగ్రత్తగా పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. అసెంబ్లీ వద్ద ఉన్న గన్ పార్క్ వద్ద మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రులు హరీష్ రావు ,కేటీఆర్ గురుకులాలపై ఆరోపణలు చేశారు.. ఆరోపణలు ఆధారాలతో సహా నిరూపించాలి.. మేము చర్చకు సిద్ధం గన్ పార్క్ వద్దకు వచ్చాం. మీ మాజీ మంత్రులు ఆధారాలతో సహా వస్తే ప్రెస్‌క్లబ్‌కి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తం టెండర్లు రూ. 1143 కోట్లు ఒకసారి రూ. 2 వేల కోట్లు, రూ. 3 వేల కోట్లు అని ఆరోపణలు చేశారు. మేము చర్చ చేయడానికి గన్ పార్క్ వద్దకు వచ్చామని మంత్రి పొన్నం తెలిపారు.
మఫత్ లాల్ మాకు ఏమైనా చుట్టమా..?
మొత్తం కొనుగోలు ప్రక్రియలో రూ. 687.77 కోట్లు టెండర్లు, ప్రభుత్వ రంగ సంస్థలు 455.23 కోట్లు ఇవ్వడం జరిగింది.. మొత్తం రూ. 1143 కోట్లు. మరి మొత్తం టెండర్లు రూ. 1143 కోట్లు అయితే రూ. 2 వేల కోట్లు, రూ. 3 వేల కోట్లు అవినీతి ఎలా జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు మఫాత్ లాల్ బట్టలు ధరించవద్దా..? మఫత్ లాల్ మాకు ఏమైనా చుట్టమా..? ఆయన ఏమైనా మాకు పిల్లనిచ్చిన మామనా..? ఈ పోటీ ప్రపంచంలో నాణ్యతకు సంబంధించిన ప్రతిపాదనలు పెట్టుకుని మా అధికారులు బాంబేతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లి క్వాలిటీని చెక్ చేసి ఇవాళ దానికి సంబంధించిన ప్రక్రియను కొనసాగిస్తుంటే కష్టపడి ఎదిగిన బలహీన వర్గాల బిడ్డలుగా ప్రజాపాలనలో పేరు వస్తుంటే ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నువ్వు చట్టసభల్లో లేవు..
తెలంగాణ పోరాట వీరులుగా మేము బహిరంగ చర్చకు సిద్ధం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నువ్వు ఐపీఎస్‌గా చేసిన వ్యక్తివి చట్టసభల్లో లేవు.. మాజీ మంత్రులు చర్చకు రావాలి. ప్రవీణ్ కుమార్ కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు విద్యార్థి నాయకులుగా మా నిజాయితీ తెలుసు. ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా గత 10 ఏళ్లుగా సోషల్ వెల్ఫేర్‌లో మీరు చేసిన అవినీతిపై విచారణ చేయాలని ముఖ్యమంత్రికి ముగ్గురం మంత్రులం విచారణ చేయాలని లేఖలు రాస్తాం. ప్రవీణ్ కుమార్ ఒళ్లు, నాలుక దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎవరు ఏది పడితే అది మాట్లాడితే జాగ్రత్త అని మంత్రి పొన్నం హెచ్చరించారు.
ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తాం..
కేటీఆర్, హరీశ్‌రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి దగుల్బాజీలను జాగ్రత్తగా ఉంచాలని కేసీఆర్‌ను కోరుతున్నాను. మేము అవినీతి చేసినట్టు నిరూపిస్తే మీ దగ్గర ఆధారాలు చూపిస్తే మేము ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తాం. శాసనసభకి రండి చర్చిద్దాం.. లేదా ప్రెస్ క్లబ్‌కి మేము మంత్రులుగా వస్తాం.. మీ మాజీ మంత్రులు రావాలి. ప్రజా పాలన ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగాలని పని చేస్తున్నాం. 327 గురుకులాలు ఉంటే అందులో మీకు సంబంధించిన ప్రైవేట్ భవనాల్లో పెట్టుకున్నారు.. మేము ఎక్కడ బకాయిలు లేకుండా గ్రీన్ చానెల్ ద్వారా చెల్లిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
సంబంధిత వార్తలు

Interstate drug gang arrest | స్పీడ్ పోస్ట్‌ల్లో గంజాయి దందా.. హైదరాబాద్‌లో చిక్కిన అంతర్రాష్ట్ర ముఠా
జులై 2, 2026

Harish Rao | చర్చకు సిద్ధమైతే.. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు..? : హరీశ్‌రావు
జులై 2, 2026

Harish Rao | రూ. లక్ష కోట్లు తగ్గింది కదా..? మరి రాజీనామా చేయ్ జూపల్లి : హరీశ్‌రావు
జులై 2, 2026
తాజావార్తలు
- ●Vishwambhara | షూటింగ్ పూర్తయిన ఏడాది తర్వాత థియేటర్లలోకి చిరంజీవి మూవీ - పదేళ్ల తర్వాత త్రిష కమ్‌బ్యాక్
- ●Interstate drug gang arrest | స్పీడ్ పోస్ట్‌ల్లో గంజాయి దందా.. హైదరాబాద్‌లో చిక్కిన అంతర్రాష్ట్ర ముఠా
- ●SBI Funds IPO | పెట్టుబడిదారులకు భారీ శుభవార్త.. ఎస్బీఐ ఫండ్స్ భారీ ఐపీఓ వస్తోంది..
- ●Harish Rao | చర్చకు సిద్ధమైతే.. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు..? : హరీశ్‌రావు
- ●Supreme Court | న్యాయ వ్యవస్థలో ఏఐ వినియోగంపై సుప్రీం ఆందోళన.. నిర్ణయాధికారం పూర్తిగా మనుషుల నియంత్రణలోనే ఉండాలని స్పష్టీకరణ
- ●HUAWEI Band 11 Series | రూ.3,999కే హువావే కొత్త స్మార్ట్ బ్యాండ్లు.. 14 రోజుల బ్యాటరీ బ్యాకప్..

Vishwambhara | షూటింగ్ పూర్తయిన ఏడాది తర్వాత థియేటర్లలోకి చిరంజీవి మూవీ - పదేళ్ల తర్వాత త్రిష కమ్‌బ్యాక్

Interstate drug gang arrest | స్పీడ్ పోస్ట్‌ల్లో గంజాయి దందా.. హైదరాబాద్‌లో చిక్కిన అంతర్రాష్ట్ర ముఠా

SBI Funds IPO | పెట్టుబడిదారులకు భారీ శుభవార్త.. ఎస్బీఐ ఫండ్స్ భారీ ఐపీఓ వస్తోంది..

Harish Rao | చర్చకు సిద్ధమైతే.. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు..? : హరీశ్‌రావు



