Erravalli | ఎర్రవల్లిలో అమరుల కాలనీ.. సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు
Erravalli | ఎర్రవల్లి(Erravalli ) లో అక్రమాలకు గురైన 45 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, అక్కడ తెలంగాణ అమరవీరుల( Telangana Martyrs ) కుటుంబాల కోసం ప్రత్యేకంగా "తెలంగాణ అమరవీరుల కాలనీ" నిర్మించి ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )కి తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ, వివిధ ఉద్యమ సంఘాలు, తెలంగాణ జేఏసీ( TG JAC ) నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Erravalli | త్రినేత్ర న్యూస్ : ఎర్రవల్లి(Erravalli ) లో అక్రమాలకు గురైన 45 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, అక్కడ తెలంగాణ అమరవీరుల( Telangana Martyrs ) కుటుంబాల కోసం ప్రత్యేకంగా "తెలంగాణ అమరవీరుల కాలనీ" నిర్మించి ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )కి తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ, వివిధ ఉద్యమ సంఘాలు, తెలంగాణ జేఏసీ( TG JAC ) నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా బుధవారం గన్ పార్కు( Gun Park ) వద్ద కమిటీ సభ్యులు, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రత్యేకంగా హాజరై పాలాభిషేకంలో పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. ఉద్యమకారులకు, అమరుల కుటుంబాలకు ఏది చేసినా తక్కువేనని, వారి త్యాగాలను సముచితంగా గౌరవించాలన్న బలమైన సంకల్పం సీఎం రేవంత్ రెడ్డి మనసులో ఉందని చెప్పారు. గత పాలకులు వ్యాపారాలు చేయకుండానే వందల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే, వాటిని పక్కా సర్వే ద్వారా రికార్డులతో సహా తేల్చి, అదే భూమిలో వచ్చే జూన్ 2 నాటికి సకల మౌలిక సదుపాయాలతో అమరవీరుల కాలనీని గృహ నిర్మాణ శాఖ ద్వారా అభివృద్ధి చేయాలని నిర్ణయించడం ఉద్యమకారుల ఘన విజయమని కొనియాడారు.
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటైన నాటి నుంచి క్షేత్రస్థాయిలో అసలైన ఉద్యమకారులను గుర్తించడంతో పాటు, వారికి న్యాయం జరిగేలా కమిటీ సభ్యులు నిరంతరం కృషి చేస్తున్నారని గుర్తుచేశారు. సెక్షన్ 22ఎ నిషేధిత భూములపై విచారణ జరిపించి అమరుల సంక్షేమానికి కేటాయించడం కమిటీకి, ఉద్యమ వర్గాలకు దక్కిన గొప్ప విజయమని తెలిపారు.
సీఎం ఆదేశాల ప్రకారం సర్వే నంబర్ 325లో గుర్తించే భూమిని నిజమైన ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, స్థానిక అర్హులైన రైతులకు పారదర్శకంగా పంపిణీ చేసే విషయంలో కమిటీ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

YIIRS | ఊపందుకున్న యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణాలు
అక్టోబర్ 7, 2026

RS Praveen Kumar | అసలు ఎవరీ సాయి ప్రసాద్? ఆయన వెనుక సీఎం ఉన్నారా? నామ్ కే వాస్తే కేసులు పెట్టాలని చెప్పిందెవరు?
అక్టోబర్ 7, 2026

POCSO Cases Telangana | మగపిల్లలకూ తప్పని లైంగిక వేధింపులు: తెలంగాణలో 9 నెలల్లో 62 పోక్సో కేసులు
అక్టోబర్ 7, 2026
తాజావార్తలు
- ●Chinese Manja Seize | రూ.7.50 లక్షల విలువైన చైనా మాంజా స్వాధీనం.. ఒకరి అరెస్ట్
- ●Janhvi Kapoor | జాన్వీ కపూర్ హిడెన్ టాలెంట్..! సోషల్ మీడియాలో ట్రోల్స్..!
- ●YIIRS | ఊపందుకున్న యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణాలు
- ●RS Praveen Kumar | అసలు ఎవరీ సాయి ప్రసాద్? ఆయన వెనుక సీఎం ఉన్నారా? నామ్ కే వాస్తే కేసులు పెట్టాలని చెప్పిందెవరు?
- ●Ranabaali | రణబాలి ట్రైలర్ ముహూర్తం ఫిక్.. 3.47 నిమిషాల నిడివితో..!
- ●POCSO Cases Telangana | మగపిల్లలకూ తప్పని లైంగిక వేధింపులు: తెలంగాణలో 9 నెలల్లో 62 పోక్సో కేసులు

Chinese Manja Seize | రూ.7.50 లక్షల విలువైన చైనా మాంజా స్వాధీనం.. ఒకరి అరెస్ట్

Janhvi Kapoor | జాన్వీ కపూర్ హిడెన్ టాలెంట్..! సోషల్ మీడియాలో ట్రోల్స్..!

YIIRS | ఊపందుకున్న యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణాలు

RS Praveen Kumar | అసలు ఎవరీ సాయి ప్రసాద్? ఆయన వెనుక సీఎం ఉన్నారా? నామ్ కే వాస్తే కేసులు పెట్టాలని చెప్పిందెవరు?



