త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Language Day | నేడు ప్ర‌జాక‌వి కాలోజీ జ‌యంతి.. తెలంగాణ భాషా దినోత్స‌వం

Telangana Language Day | తెలంగాణ వైతాళికుడు, ప్ర‌జాక‌వి కాళోజీ నార‌య‌ణ రావు (Kaloji Narayana Rao) జ‌యంతి. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల భాష‌లోనే పాల‌కుల‌ను ప్ర‌శ్నించిన కాళోజీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని (Birth Anniversary) ఏటా సెప్టెంబ‌ర్ 9న తెలంగాణ భాషా దినోత్స‌వంగా (Telangana Language Day) ప్ర‌భుత్వం జ‌రుపుతున్న‌ది.

G

Telangana | Published On Sep 9, 2026, 8.16 am IST

Telangana Language Day | నేడు ప్ర‌జాక‌వి కాలోజీ జ‌యంతి.. తెలంగాణ భాషా దినోత్స‌వం
Advertisement

Telangana Language Day | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ వైతాళికుడు, ప్ర‌జాక‌వి కాళోజీ నార‌య‌ణ రావు (Kaloji Narayana Rao) జ‌యంతి. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల భాష‌లోనే పాల‌కుల‌ను ప్ర‌శ్నించిన కాళోజీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని (Birth Anniversary) ఏటా సెప్టెంబ‌ర్ 9న తెలంగాణ భాషా దినోత్స‌వంగా (Telangana Language Day) ప్ర‌భుత్వం జ‌రుపుతున్న‌ది. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ది. భాషా, సాహిత్య రంగాల్లో విశేష కృషి చేసిన ప్ర‌ముఖుల‌కు ప్ర‌భుత్వం `కాళోజీ సాహిత్య పుర‌స్కారం` అందిస్తున్న‌ది. తెలంగాణ యాస అంటే తెలుగు భాష అని గ‌ట్టిగా వాదిస్తూ త‌న ర‌చ‌న‌ల‌తో విమ‌ర్శ‌కుల‌ను మెప్పించిన క‌వి, ర‌చ‌యిత కాళోజీ. తెలంగాణ మట్టి వాసనను, ఇక్కడి యాసలోని సౌందర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన కాళోజీ జ‌నం భాష‌లో 30 నుంచి 40 ర‌చ‌న‌లు చేశారు.

`నా గొడవ` అని ఎలుగెత్తి చాటిన ప్రజాకవి (Prajakavi Kaloji).. సామాన్య ప్రజల భాషలోనే సాహిత్యాన్ని సృష్టించారు. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొని, అన్యాయాలను ఎండగట్టడానికి కవితలను ఆయుధంగా మలచుకున్నారు. `తెలుగు భాషకు సొగసులద్దింది తెలంగాణ యాసే` అని చాటిచెప్పారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ యాస.. ప్ర‌స్తుతం సాహిత్యం, సినిమా, నాటకరంగం, సామాజిక మాధ్యమాలలో త‌న‌ ప్రత్యేకను చాటుకుంటున్న‌ది. అమాయకత్వంతో పాటు పదునైన వ్యంగ్యాన్ని, అపరిమితమైన ఆప్యాయతను పండించగల శక్తి తెలంగాణ (Telangana) మాటలకు ఉంది. భాషా దినోత్సవం సందర్భంగా ఈ మ‌ట్టి భాష ఔన్న‌త్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మ‌హ‌నీయుల‌ కృషిని మ‌నం త‌ప్పకుండా స్మరించుకోవాల్సిందే. భ‌విష్య‌త్ త‌రాల‌కు అమ్మ‌భాష‌ను అందించాలి. ప్ర‌భుత్వ అధికారిక కార్య‌క్ర‌మాల‌లో తెలుగు వాడ‌కాన్ని పాల‌కుటు త‌ప్ప‌నిస‌రి చేయాలి.

Advertisement
Advertisement