త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Inter Results | మే 13 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

TG Inter Results | తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల్లో ఫెయిలైన విద్యార్థుల‌కు మే 13 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు బోర్డు అధికారులు వెల్ల‌డించారు.

S

Telangana | Published On Apr 12, 2026, 11.27 am IST

TG Inter Results | మే 13 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు
Advertisement

TG Inter Results | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల్లో ఫెయిలైన విద్యార్థుల‌కు మే 13 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు బోర్డు అధికారులు వెల్ల‌డించారు. ప్ర‌తి రోజు రెండు సెష‌న్ల‌లో ఎగ్జామ్స్ నిర్వ‌హిస్తామ‌ని పేర్కొన్నారు. ప్రాక్టిక‌ల్ ఎగ్జామ్స్‌ను మే 22 నుంచి నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇవాళ విడుద‌లైన ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాల్లో ఉత్తీర్ణ‌త సాధించ‌ని విద్యార్థులు.. అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల కోసం.. సంబంధిత కాలేజీల్లో ఏప్రిల్ 13 నుంచి 20వ తేదీ వ‌ర‌కు ఫీజు చెల్లించేందుకు అవ‌కాశం క‌ల్పించారు.

ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాలు ఇలా..

ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌ల‌కు మొత్తం 4,89,123 మంది విద్యార్థులు హాజ‌రు కాగా, 3,23,807 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. మొత్తంగా 66.20 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. ఇందులో 2,49,110 మంది బాలిక‌లు ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా, 1,85,331 మంది పాస‌య్యారు. బాలిక‌ల ఉత్తీర్ణ‌త శాతం 74.40 శాతంగా న‌మోదైంది. బాలురు 2,40,013 మంది హాజ‌రు కాగా, 1,38,475 మంది ఉత్తీర్ణ‌త పొందారు. బాలుర ఉత్తీర్ణ‌త శాతం 57.69 శాతంగా న‌మోదైంది.

సెకండియ‌ర్ ఫ‌లితాలు ఇలా..

ఇంట‌ర్ సెకండియ‌ర్ ప‌రీక్ష‌ల‌కు మొత్తం 5,07,948 మంది విద్యార్థులు హాజ‌రు కాగా, 3,58,490 మంది పాస‌య్యారు. మొత్తం ఉత్తీర్ణ‌త శాతం 70.58 శాతంగా న‌మోదైంది. 2,54,050 మంది బాలిక‌లు ప‌రీక్ష‌లు రాయ‌గా, 1,99,813 మంది పాసై 78.65 శాతం న‌మోదు చేశారు. బాలురు 2,53,898 మంది హాజ‌రు కాగా, 1,58,677 మంది పాస‌య్యారు. బాలుర ఉత్తీర్ణ‌త శాతం 62.50 శాతంగా న‌మోదైంది.

Advertisement

తాజావార్తలు

Advertisement