త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Budget | దేశానికి గ్రోత్ ఇంజిన్‌గా తెలంగాణ..

Telangana Budget | త్రినేత్ర‌.న్యూస్‌: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3,24,234 కోట్లతో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌వేశ‌పెట్టారు. బడ్జెట్‌లో పల్లెల అభివృద్ధి, విద్య, వ్యవసాయం, నీటిపారుదల రంగాలకు అగ్ర ప్రాధాన్యం దక్కింది.

G

Telangana | Published On Mar 20, 2026, 1.20 pm IST

Telangana Budget | దేశానికి గ్రోత్ ఇంజిన్‌గా తెలంగాణ..
Advertisement

Telangana Budget | త్రినేత్ర‌.న్యూస్‌: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3,24,234 కోట్లతో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌వేశ‌పెట్టారు. బడ్జెట్‌లో పల్లెల అభివృద్ధి, విద్య, వ్యవసాయం, నీటిపారుదల రంగాలకు అగ్ర ప్రాధాన్యం దక్కింది. బ‌డ్జెట్ అంటే సంఖ్య‌ల చుట్టూ తిరిగే అంకెలు కాద‌ని, ప్ర‌జ‌ల చుట్టూ తిరిగే సంఖ్య‌లు అని పేర్కొన్న ఆయ‌న దేశానికి బ‌ల‌మైన గ్రోత్ ఇంజిన్‌గా తెలంగాణ నిలుస్తున్న‌ద‌ని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక స్థితిని వివ‌రించారు.

2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) ప్రస్తుత ధరల ప్రకారం రూ.17,82,198 కోట్లు అని చెప్పారు. గతేడాదితో పోలిస్తే వృద్ధిరేటు 10.7 శాతంగా నమోదయింద‌న్నారు. ఇదే సమయంలో దేశ జీడీపీ రూ.3,57,13,886 కోట్లు కాగా, వృద్ధిరేటు 8 శాతంగా ఉంది. తెలంగాణ వృద్ధి రేటు దేశ సగటు వృద్ధి రేటు కంటే 2.7 శాతం ఎక్కువగా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. అదే విధంగా దేశ జీడీపీలో రాష్ట్ర జీఎస్‌డీపీ (GSDP) 5.0 శాతం వాటా కలిగి దేశానికి ఒక బలమైన ‘గ్రోత్ ఇంజిన్’గా తెలంగాణ నిలుస్తున్న‌ది.

దేశ వృద్ధిరేటు తగ్గుతూ మందగమనంలో ఉన్నప్పటికీ, రాష్ట్ర వృద్ధిరేటులో మెరుగైన పెరుగుదల కనబడుతున్న‌ద‌ని చెప్పారు. ప్రస్తుత ధరల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 9.8 శాతంగా ఉన్న దేశ జీడీపీ వృద్ధి రేటు, 2025-26 నాటికి 8 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి వృద్ధిరేటు 2024-25లో 10.6 శాతం నుంచి 2025-26 నాటికి 10.7 శాతానికి పెరిగింది. దీని ద్వారా, మన ప్రభుత్వం ఆచరిస్తున్న విధానాలు సరైన‌ దిశలో ఉన్నాయని, అవి అభివృద్ధికి తోడ్పడుతున్నాయని అనడానికి నిదర్శనమ‌ని పేర్కొన్నారు.

రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని తెలిపారు. 2025-26లో, ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931 కాగా, వృద్ధి రేటు 10.2 శాతం. దేశ తలసరి ఆదాయం రూ.2,19,575 కాగా, వృద్ధిరేటు కేవలం 6.9 శాతం. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,99,356 ఎక్కువ. అంటే 1.9 రెట్లు ఎక్కువగా ఉందని చెప్పారు.

ప్ర‌స్తుతం 200 బిలియన్ యూఎస్‌ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా ప్ర‌భుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకున్న‌ద‌ని తెలిపారు. దీనిని సాధించడానికి విభాగాలవారీగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

  • తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి- రూ.17,82,198 కోట్లు
  • భార‌త దేశ స్థూల జాతీయోత్ప‌త్తి- రూ.3,57,13,886 కోట్లు
  • దేశ GDPలో రాష్ట్ర GSDP వాటా- 5.0 శాతం
  • భార‌త దేశ వృద్ధి రేటు- 8 శాతం
  • తెలంగాణ వృద్ధి రేటు- 10.7 శాతం
  • తెలంగాణ త‌ల‌స‌రి ఆదాయం- 4,18,931
  • భార‌త దేశ త‌ల‌స‌రి ఆదాయం- 2,19,575
Advertisement

తాజావార్తలు

Advertisement