త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalyana Lakshmi & Shaadi Mubarak | కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్స్‌ బంద్ అవుతున్నాయా? మంత్రి పొన్నం కీలక ప్రకటన

తెలంగాణలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆగిపోతాయన్న ప్రచారానికి మంత్రి పొన్నం ప్రభాకర్ చెక్ పెట్టారు. హైకోర్టులో ఈ స్కీమ్స్ కొనసాగింపు కోసం ప్రభుత్వం గట్టిగా పోరాడుతోందని, పేదల సంక్షేమమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

J

Telangana | Published On Aug 22, 2026, 2.56 pm IST

Kalyana Lakshmi & Shaadi Mubarak | కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్స్‌ బంద్ అవుతున్నాయా? మంత్రి పొన్నం కీలక ప్రకటన
Advertisement
  • కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోవని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టీకరణ
  • గత ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడం వల్లే కోర్టు స్టే విధించిందని, ఇప్పుడు వెకేట్ పిటిషన్ వేశామని వెల్లడి
  • హైకోర్టులో ఈ పథకాల కొనసాగింపు కోసం ప్రభుత్వం తరఫున స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ వినిపించినట్లు క్లారిటీ
  • పేద ప్రజల సంక్షేమంపై విపక్షాలు అనవసర రాజకీయం చేయొద్దని, వీలైతే కోర్టులో ఇంప్లీడ్ కావాలని కౌంటర్

Kalyana Lakshmi & Shaadi Mubarak | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో ఎంతో పాపులర్ అయిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంక్షేమ పథకాలు ఇకపై ఆగిపోతాయంటూ జరుగుతున్న ప్రచారంపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పేద వర్గాలకు చెందిన ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించే ఈ అద్భుతమైన పథకాలను రద్దు చేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసమే పనిచేస్తోందని, ఈ స్కీమ్స్ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

హైకోర్టులో సర్కార్ స్ట్రాంగ్ ఫైట్

ఈ పథకాలపై ప్రస్తుతం హైకోర్టులో జరుగుతున్న విచారణ గురించి మంత్రి కీలక అప్‌డేట్ ఇచ్చారు. గత ప్రభుత్వం సరైన సమయంలో కౌంటర్ దాఖలు చేయకపోవడం వల్లే కోర్టు స్టే విధించిందని గుర్తుచేశారు. అయితే, ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే అలర్ట్ అయిన ప్రస్తుత సర్కార్.. వెంటనే కౌంటర్ దాఖలు చేయడంతో పాటు vacate petition కూడా వేసిందని తెలిపారు. కోర్టులో హియరింగ్ పూర్తయిందని, పేదలకు అండగా నిలబడే ప్రభుత్వ policy decision కు న్యాయస్థానం నుంచి తప్పక సానుకూల తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాల పాలిటిక్స్ కరెక్ట్ కాదు

ఇలాంటి సున్నితమైన అంశాల మీద ప్రతిపక్ష పార్టీలు చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పథకాలు ఆగిపోయి, ప్రభుత్వం ఇరకాటంలో పడితే చూసి ఆనందించాలనుకోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అన్నారు. నిజంగా విపక్షాలకు పేదల మీద ప్రేమ ఉంటే.. అనవసర విమర్శలు మానేసి, న్యాయస్థానంలో ఇంప్లీడ్ అయి పేద ప్రజల తరఫున వాదనలు వినిపించాలని కౌంటర్ ఎటాక్ చేశారు. ఏది ఏమైనా, న్యాయపరమైన చిక్కులను దాటుకుని ఈ స్కీమ్స్ ఫలాలు ప్రజలకు అందేలా చూస్తామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Advertisement