Kalyana Lakshmi | పెళ్లై పిల్లలు కూడా పుట్టారు.. ఇంకా కళ్యాణలక్ష్మీ చెక్ రాలేదు
Kalyana Lakshmi | పెళ్లై రెండు, మూడేండ్లు అవుతుంది.. పిల్లలు కూడా పుట్టారు.. అయినా ఇంకా కళ్యాణలక్ష్మీ చెక్ రాలేదు అని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
Kalyana Lakshmi | త్రినేత్ర.న్యూస్ : పెళ్లై రెండు, మూడేండ్లు అవుతుంది.. పిల్లలు కూడా పుట్టారు.. అయినా ఇంకా కళ్యాణలక్ష్మీ చెక్ రాలేదు అని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న చెక్ వచ్చిందని ఎమ్మార్వో కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది.. తీరా వెళ్తే.. మీకు ఎవరు ఫోన్ చేశారని అధికారులు బెదిరింపులకు పాల్పడ్డారని మహిళలు బోరుమన్నారు. ఈ పరిస్థితి కూకట్‌పల్లి ఎమ్మార్వో కార్యాలయం వద్ద గురువారం వెలుగు చూసింది.
ఎమ్మార్వో ఆఫీసు ముందు ఆందోళనకు దిగిన కళ్యాణలక్ష్మీ లబ్దిదారులు మాట్లాడుతూ.. నిన్న చెక్కు తీసుకోండి అని ఫోన్ చేశారు కదా అంటే ఎవరు చేశారు అంటూ.. మమ్ములను ఎమ్మార్వో కార్యాలయం సిబ్బంది భయపెట్టారు. మీరు ఇక్కడే ఉంటే పోలీసులను పిలిచి పోలీసు స్టేషన్‌కు పంపుతాం అంటూ బెదిరిస్తున్నారు. మేము చిన్న పిల్లలను ఎత్తుకొని ఇక్కడకు వచ్చాం.. మా కళ్యాణలక్ష్మీ చెక్కు మాకు ఇస్తారనుకున్నాం.. కానీ ఇవ్వడం లేదు. చెక్ ఎందుకు ఇవ్వరు అంటే కోర్టులో స్టే ఉందంటున్నారు. మేము అప్లై చేసింది మూడు సంవత్సరాల కింద అప్పుడు స్టే లేదు కదా. ఇప్పుడు స్టే వస్తే అప్పటి చెక్కులు ఎందుకు ఆపుతున్నారు అని మహిళలు ధ్వజమెత్తారు.
పెళ్లై పిల్లలు పుట్టిన కళ్యాణలక్ష్మీ చెక్‌లు రావడం లేదన్నారు. మా చెక్‌లు మాకు ఇచ్చేవరకు ఇక్కడ నుండి వెళ్ళేది లేదని భీష్మించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో కళ్యాణలక్ష్మీ చెక్‌ను ఇంటికి తెచ్చి ఇచ్చేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడు చెక్ కోసం ఎదురు చూడలేదు. మా పెద్ద బిడ్డ పెళ్లి అయితే కేవలం మూడు నెలల్లో ఇంటికి తెచ్చి ఇచ్చారు. కానీ ఇప్పుడు మూడేండ్లు అయిన ఇవ్వడం లేదు అంటూ బాధితులు ఆవేదన వెలిబుచ్చారు.
తాజావార్తలు
- ●RSP | రేవంతూ.. మీరు పాలిటెక్నిక్ చేసి బీఏ చేయగలిగినప్పుడు.. ఈ పిల్లలు ఈసెట్‌కు పోతే తప్పేముంది..?
- ●Rashmika Deverakonda | రష్మిక దేవరకొండ - భర్త ఇంటి పేరుతో నేషనల్ క్రష్ పోస్ట్ వైరల్ - విజయ్ క్యూట్ రిప్లై
- ●Konda Surekha former OSD | రూ.10 కోట్ల కోసం వ్యాపారిపై దాడి.. కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌పై అటెంప్ట్ మర్డర్ కేసు
- ●iQOO Z11 | ఐక్యూ జడ్11 వచ్చేసింది.. భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లే, ఏఐ ఫీచర్లు..
- ●Bhatti Vikramarka | కృష్ణా జలాల్లో న్యాయమైన వాటానే కోరుతున్నాం
- ●Telangana 22A Lands | భూయజమానులు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రావొద్దు

RSP | రేవంతూ.. మీరు పాలిటెక్నిక్ చేసి బీఏ చేయగలిగినప్పుడు.. ఈ పిల్లలు ఈసెట్‌కు పోతే తప్పేముంది..?

Rashmika Deverakonda | రష్మిక దేవరకొండ - భర్త ఇంటి పేరుతో నేషనల్ క్రష్ పోస్ట్ వైరల్ - విజయ్ క్యూట్ రిప్లై

Konda Surekha former OSD | రూ.10 కోట్ల కోసం వ్యాపారిపై దాడి.. కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌పై అటెంప్ట్ మర్డర్ కేసు

iQOO Z11 | ఐక్యూ జడ్11 వచ్చేసింది.. భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లే, ఏఐ ఫీచర్లు..





