త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Danam Nagender | బీఆర్ఎస్‌కి రాజీనామా చేయలే.. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలే: దానం నాగేంద‌ర్‌

Danam Nagender | తాను బీఆర్ఎస్‌కు (BRS) రాజీనామా చేయ‌లేద‌ని, కాంగ్రెస్ (Congress) పార్టీ స‌భ్య‌త్వం తీసుకోలేద‌ని ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ (Danam Nagender ) చెప్పారు. ప్ర‌స్తుతం తాను ఏ పార్టీలోనూ లేన‌ని తెలిపారు.

G

Telangana | Published On Aug 19, 2026, 9.39 am IST

Danam Nagender | బీఆర్ఎస్‌కి రాజీనామా చేయలే.. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలే: దానం నాగేంద‌ర్‌
Advertisement

Danam Nagender | త్రినేత్ర‌.న్యూస్‌: తాను బీఆర్ఎస్‌కు (BRS) రాజీనామా చేయ‌లేద‌ని, కాంగ్రెస్ (Congress) పార్టీ స‌భ్య‌త్వం తీసుకోలేద‌ని ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ (Danam Nagender ) చెప్పారు. ప్ర‌స్తుతం తాను ఏ పార్టీలోనూ లేన‌ని తెలిపారు. ఈమేర‌కు అనర్హత పిటిషన్‌పై (Defection) హైకోర్టుకు వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు (MLA Defection Case) అంశంలో స్పీకర్ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను (High Court) హైకోర్టు విచారించింది. ఈ సంద‌ర్భంగా దానం నాగేందర్ త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది గౌర‌వ్ అగ‌ర్వాల్ వాద‌న‌లు వినిపిస్తూ.. కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఎక్కడా ప్రకటించలేదని, బీఆర్ఎస్ సభ్యుడిగానే కొనసాగుతున్నాడని కోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇతర పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయకూడదని ఎక్కడా నిబంధన లేదన్నారు.

ఫొటోలు, మీడియా క‌థ‌నాల ఆధారంగా పార్టీ మారిన‌ట్లు నిర్ధారించి అన‌ర్హ‌త వేటు వేయ‌కూడ‌ద‌ని, అలాగే అన‌ర్హ‌త పిటిష‌న్‌లో లేని ఆరోప‌ణ‌ల‌ను అద‌న‌పు అఫిడ‌విట్ ద్వారా చేర్చ‌డంపై చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌ను ప‌రిశీలించాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు. 2024 మార్చి 15న ముఖ్య‌మంత్రిని, ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని దానం నాగేంద‌ర్ క‌లిశార‌ని, మెడ‌లో కాంగ్రెస్ కండువా వేశారంటూ వార్తా ప‌త్రిక‌ల క‌థ‌నాల‌ను స‌మ‌ర్పించార‌న్నారు. అయితే తాను కాంగ్రెస్‌లో చేరిన‌ట్లు దానం ఎక్క‌డా ప్ర‌క‌టించ‌లేద‌ని చెప్పారు. న్యాయ నిబంధనల ప్రకారమే స్పీకర్ తీర్పు ఇచ్చారని, స్పీక‌ర్ నిర్ణ‌యం చ‌ట్ట‌విరుద్ధ‌మైన‌ప్పుడే కోర్టులు జోక్యం చేసుకోవాలన్నారు. ఈ కేసులో కోర్టు జోక్యం అవసరం లేదని పేర్కొన్నారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది.

Advertisement
Advertisement