Kaaka Movie | ‘కాకా’గా చిరంజీవి.. డబుల్ షేడ్స్‌లో మెగాస్టార్ అదుర్స్..!
Kaaka Movie | మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కాకా’. వెంకట్ కె. నారాయణ కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. కథానాయకుడి పాత్రను పరిచయం చేస్తూనే.. హాస్యం, మిస్టరీ, మాస్ అంశాలను మేళవించారు.
Entertainment | Published On Aug 22, 2026, 2.39 pm IST
Kaaka Movie | మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కాకా’. వెంకట్ కె. నారాయణ కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. కథానాయకుడి పాత్రను పరిచయం చేస్తూనే.. హాస్యం, మిస్టరీ, మాస్ అంశాలను మేళవించారు. ఈ సినిమాలో చిరంజీవి కే సత్యం పాత్రలో కనిపించనున్నారు. ఆక్వా పరిశ్రమలో సూపర్‌వైజర్‌గా పనిచేసే మధ్య వయస్కుడిగా ఆయన కనిపిస్తారు. తన చుట్టూ ఉన్నవారితో సరదాగా మాట్లాడుతూ.. కుటుంబ బాధ్యతలను చూసుకునే సాధారణ వ్యక్తిగా సత్యం పాత్రను పరిచయం చేశారు. కుమార్తె స్కూటర్ తాళాల చుట్టూ జరిగే ఓ చిన్న సంభాషణతో గ్లింప్స్ మొదలవుతుంది. ఈ క్రమంలో స్కూటర్ తాళాలు నీటిలో పడిపోతాయి. వాటిని బయటకు తీసేందుకు సత్యం భారీ అయస్కాంతాన్ని ఉపయోగిస్తాడు. అయితే.. తాళాలతోపాటు తుపాకులు బయటకు వస్తాయి. దీంతో ఒక్కసారిగా సన్నివేశం మలుపు తిరుగుతుంది. సత్యం గతం ఏంటి? అతనికి తుపాకులతో ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలు రేకెత్తేలా చేసి ‘కాకా’ టైటిల్‌ను రివీల్ చేశారు.
Meet Supervisor Satyam,
C/O Ammaji Aqua Industries, Ravulapalem.Team #KAAKA wishes the one and only Megastar @Kchirutweets garu a very HAPPY BIRTHDAY ❤️🔥
TITLE GLIMPSE OUT NOW😎
— https://t.co/Qtc0T6fhcCJANUARY 13, 2027 - SANKRANTHI RELEASE 🔥#HBDMegastarChiranjeevi
— KVN Productions (@KvnProductions) August 22, 2026
అక్కడి నుంచి గ్లింప్స్ పూర్తిగా మరో మూడ్‌లోకి వెళ్తుంది. యువ చిరంజీవి సరికొత్త లుక్‌లో కనిపిస్తారు. ఒంటి చేత్తో తుపాకీ పట్టుకుని వరుసగా కాల్పులు జరుపుతూ మాస్ యాక్షన్‌తో అదరగొట్టారు. ఒకే పాత్రలో రెండు భిన్నమైన షేడ్స్‌ను చూపించడంతో సత్యం గతం, వర్తమానం మధ్య ఉన్న సంబంధంపై ఆసక్తి పెరిగింది. హీరో ఎలివేషన్‌కు ముందే పాత్ర చుట్టూ ఆసక్తిని పెంచేలా దర్శకుడు బాబీ కొల్లి గ్లింప్స్‌ను తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. తొలి భాగంలో పాత్ర, దాని చుట్టూ ఉన్న పరిస్థితులను పరిచయం చేస్తూ కథలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఒక్కసారిగా స్టైల్, యాక్షన్‌తో గ్లింప్స్ వేగం పుంజుకుంది. సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా పనితనం గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమన్ అందించిన నేపథ్య సంగీతం యాక్షన్ సన్నివేశాలకు మరింత బలాన్నిచ్చింది. ‘గ్యాంగ్ లీడర్’ పాట రీమిక్స్ ద్వారా చిరంజీవి అభిమానులకు పాత జ్ఞాపకాలను గుర్తుచేశారు. నిర్మాణ విలువలు కూడా భారీ స్థాయిలో కనిపిస్తున్నాయి.
సాధారణ సూపర్‌వైజర్‌గా కనిపించే సత్యం పాత్రలో చిరంజీవి హావభావాలు సహజంగా అనిపించగా.. యువకుడి పాత్రలో ఆయన స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో చిరంజీవి మాస్ ఇమేజ్‌ను మరోసారి గుర్తుచేసేలా గ్లింప్స్ సాగింది. కథకు సంబంధించిన వివరాలను పూర్తిగా బయటపెట్టకుండా.. సినిమా మూడ్, కథానాయకుడి పాత్రలోని రెండు కోణాలను మాత్రమే పరిచయం చేశారు. దీంతో ‘కాకా’పై అంచనాలతోపాటు తదుపరి అప్‌డేట్‌పై ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో సునీల్, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13న ‘కాకా’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Strait of Hormuz | హోర్ముజ్‌లో ఉద్రిక్తతలు ఉన్నా, కొనసాగుతున్న చమురు రవాణా..అమెరికా ఇంధన శాఖ మంత్రి వెల్లడి..
- ●Deviprasad | ఉద్యోగులకు స్మార్ట్ హెల్త్ కార్డులు ఎందుకు ఇవ్వరు?
- ●EVM Manipulation | ఈవీఎం హ్యాకింగ్ సాధ్యమేనా? నెట్టింట Form 17C వైరల్
- ●Ponnam Prabhakar | తెలంగాణకు నిధులెందుకు ఇవ్వరు?.. బీజేపీ రాష్ట్ర నాయకులు సమాధానం చెప్పాలి
- ●Supreme Court | సుప్రీంకోర్టులో ఒక్కరోజే 400 కేసులకు పరిష్కారం
- ●Srinivas Goud | ఉద్యోగుల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది : మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్

Strait of Hormuz | హోర్ముజ్‌లో ఉద్రిక్తతలు ఉన్నా, కొనసాగుతున్న చమురు రవాణా..అమెరికా ఇంధన శాఖ మంత్రి వెల్లడి..

Deviprasad | ఉద్యోగులకు స్మార్ట్ హెల్త్ కార్డులు ఎందుకు ఇవ్వరు?

EVM Manipulation | ఈవీఎం హ్యాకింగ్ సాధ్యమేనా? నెట్టింట Form 17C వైరల్

Ponnam Prabhakar | తెలంగాణకు నిధులెందుకు ఇవ్వరు?.. బీజేపీ రాష్ట్ర నాయకులు సమాధానం చెప్పాలి





