Deviprasad | ఉద్యోగులకు స్మార్ట్ హెల్త్ కార్డులు ఎందుకు ఇవ్వరు?
Deviprasad | అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లే ఉద్యోగులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ జీ దేవీప్రసాద్ ఆరోపించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఉద్యోగులకు స్మార్ట్ హెల్త్ కార్డులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
- ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తోంది
- హామీల అమలులో పూర్తిగా విఫలమైంది
- ఈహెచ్ఎస్ సేవలు అందక తీవ్ర ఇబ్బందులు
- ప్రభుత్వంపై కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ జీ దేవీప్రసాద్ ధ్వజం
Deviprasad | అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లే ఉద్యోగులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ జీ దేవీప్రసాద్ ఆరోపించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఉద్యోగులకు స్మార్ట్ హెల్త్ కార్డులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈహెచ్‌ఎస్ (EHS) సేవలు సక్రమంగా అందక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దేవీప్రసాద్ తెలిపారు. రిటైర్డ్ టీచర్ ఖాజా మొహియుద్దీన్‌కు ఈహెచ్‌ఎస్ వర్తించకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రిలో రూ.8 లక్షలు బిల్లు చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా అసమర్థతకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు.
రూ.15వేల కోట్ల బకాయిలు
ఉద్యోగుల పెన్షనర్లకు సుమారు రూ.15 వేల కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని దేవీప్రసాద్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల రికవరీ కోసం కమిటీలు వేస్తున్నారే తప్ప.. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. పెన్షన్ చెల్లింపులో ఒక్కరోజు ఆలస్యమైనా ఉద్యోగుల నుంచి వడ్డీ వసూలు చేస్తున్నారని, మరి ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తాలకు వడ్డీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల సభకు అనుమతి ఎందుకు?
సీపీఎస్ ఉద్యోగులు సభ నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని దేవీప్రసాద్ తప్పుబట్టారు. ‘‘సీపీఎస్ ఉద్యోగులు ఏమైనా దేశద్రోహులా? వారి సభకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు?’’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షిస్తున్న సుమారు 70 వేల మంది పోలీసు కానిస్టేబుళ్లు కూడా సీపీఎస్ ఉద్యోగులేనని గుర్తుచేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగులు సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అనేక అనుమతులు ఇచ్చారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల నిరసనలను అడ్డుకోవడం సరికాదన్నారు.
ప్రతి పనికీ హైకోర్టును ఆశ్రయించాల్సిందే
రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని దేవీప్రసాద్ విమర్శించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు మాజీ మంత్రి హరీశ్‌రావు వెళ్తుంటే.. కాలు బయట పెట్టకముందే హౌస్ అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించాలని సూచించారు. ఉద్యోగుల నిరసన సభకు బీఆర్‌ఎస్ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని దేవీప్రసాద్ తెలిపారు. ఉద్యోగులతో భుజం భుజం కలిపి పోరాడతామని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, టీఎన్‌జీవో సంఘం మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నేత భుజంగరావు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | తెలంగాణకు నిధులెందుకు ఇవ్వరు?.. బీజేపీ రాష్ట్ర నాయకులు సమాధానం చెప్పాలి
ఆగస్టు 22, 2026

Srinivas Goud | ఉద్యోగుల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది : మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ఆగస్టు 22, 2026

Raghunandan Rao | తన కుర్చీ కిందకు నీళ్లు తెస్తున్నారనే.. అమెరికా పర్యటన రద్దు చేసుకున్న సీఎం రేవంత్: బీజేపీ ఎంపీ రఘునందన్ రావు
ఆగస్టు 22, 2026
తాజావార్తలు
- ●Janhvi Kapoor | అమ్మానాన్నల పెళ్లి స్వర్గంలోనే.. జాన్వీ చిన్ననాటి కామెంట్స్ వైరల్..
- ●Manan Kumar Mishra | రూ.150 కోట్ల స్కాం.. ఫ్యామిలీకే పదవులు : బీసీఐ చైర్మన్ మనన్ 15 రోజుల్లో రాజీనామా చేయాల్సిందే
- ●Jupally Krishna Rao | ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ..
- ●bus ploughs into crowd | జనంపైకి దూసుకెళ్లిన బస్సు.. ఐదుగురు మృతి
- ●Forest | హెచ్ఐవీ సోకిందని మహిళను అడవిలో వదిలేశారు..
- ●Microsoft | మైక్రోసాఫ్ట్‌కు తొలి వెరా రూబిన్ ఏఐ ప్లాట్‌ఫామ్.. కీలక మైలురాయి..

Janhvi Kapoor | అమ్మానాన్నల పెళ్లి స్వర్గంలోనే.. జాన్వీ చిన్ననాటి కామెంట్స్ వైరల్..

Manan Kumar Mishra | రూ.150 కోట్ల స్కాం.. ఫ్యామిలీకే పదవులు : బీసీఐ చైర్మన్ మనన్ 15 రోజుల్లో రాజీనామా చేయాల్సిందే

Jupally Krishna Rao | ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ..

bus ploughs into crowd | జనంపైకి దూసుకెళ్లిన బస్సు.. ఐదుగురు మృతి



