త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Strait of Hormuz | హోర్ముజ్‌లో ఉద్రిక్తతలు ఉన్నా, కొనసాగుతున్న చమురు రవాణా..అమెరికా ఇంధ‌న శాఖ మంత్రి వెల్ల‌డి..

Strait of Hormuz | ప్రాంతీయ ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నప్పటికీ హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలు కొనసాగుతున్నాయని అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ తెలిపారు. అమెరికా, మిత్రదేశాల నౌకాదళ బలగాల ముమ్మర కదలికలు ఇంధన ట్యాంకర్ల రాకపోకలకు భద్రత కల్పించడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన పేర్కొన్నారు.

S

Business | Published On Aug 22, 2026, 1.52 pm IST

Strait of Hormuz | హోర్ముజ్‌లో ఉద్రిక్తతలు ఉన్నా, కొనసాగుతున్న చమురు రవాణా..అమెరికా ఇంధ‌న శాఖ మంత్రి వెల్ల‌డి..
Advertisement

Strait of Hormuz | ప్రాంతీయ ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నప్పటికీ హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలు కొనసాగుతున్నాయని అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ తెలిపారు. అమెరికా, మిత్రదేశాల నౌకాదళ బలగాల ముమ్మర కదలికలు ఇంధన ట్యాంకర్ల రాకపోకలకు భద్రత కల్పించడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన పేర్కొన్నారు. తాజాగా ఈ వ్యూహాత్మక జలమార్గం ద్వారా 1.5 కోట్ల బ్యారెళ్లకు పైగా చమురు, పెట్రోలియం ఉత్పత్తులు సురక్షితంగా రవాణా అయ్యేలా సంయుక్త చర్యలు విజయవంతమయ్యాయని రైట్ వెల్లడించారు. ప్రపంచ మార్కెట్ల స్థిరత్వాన్ని కాపాడేందుకు వాషింగ్టన్ కట్టుబడి ఉందనడానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ఎగుమతులపై కీలక గణాంకాలు..

ఇంధన శాఖ మంత్రి పరిశీలించిన గణాంకాల ప్రకారం, గత వారం హోర్ముజ్ జలసంధి ద్వారా రోజుకు సగటున సుమారు 90 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా జరిగింది. సముద్ర రవాణాకు భద్రత కల్పించేందుకు చేపట్టిన సమన్వయ చర్యల ఫలితంగానే ఈ ప్రవాహం కొనసాగిందని రైట్ తెలిపారు. పైప్‌లైన్ సరఫరాలు, ఆధునిక ఎగుమతి సదుపాయాలను కలుపుకుంటే ఈ ప్రాంతం నుంచి రోజుకు మొత్తం దాదాపు 2 కోట్ల బ్యారెళ్ల చమురు బయటకు వెళ్తుందని ఆయన చెప్పారు. ప్రపంచ ఇంధన సరఫరా సమతుల్యతలో హోర్ముజ్ జలసంధికి ఉన్న అత్యంత కీలక ప్రాధాన్యాన్ని ఇది స్పష్టం చేస్తోంది. కాగా అమెరికా తన సైనిక ఉనికిని మరింత ముమ్మరం చేస్తోంది. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం.. వాణిజ్య రవాణా నౌకల్లో 68 నౌకల దిశను విజయవంతంగా మళ్లించారు. మరో మూడు నౌకల కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఇరాన్‌పై విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని కచ్చితంగా అమలు చేయడంలో భాగంగా మరో రెండు నౌకల్లోకి సైనికులు ప్రవేశించి తనిఖీలు నిర్వహించారు. ఈ దిగ్బంధానికి ప్రాంతంలో మోహరించిన 20కి పైగా యుద్ధనౌకలు మద్దతుగా ఉన్నాయి. కెప్లర్ గణాంకాల ప్రకారం.. ఈ పరిణామాల కారణంగా ఇరాన్ ముడి చమురు ఎగుమతులు యుద్ధానికి ముందు స్థాయితో పోలిస్తే భారీగా తగ్గిపోయాయి. ప్రస్తుతం అవి అప్పటి స్థాయిలో ఏడో వంతుకు పడిపోయినట్లు సమాచారం.

https://twitter.com/PTI_News/status/2091029218029130166?s=20

నియంత్రణ కోసం పోరు..

ప్రాంతీయ రాజకీయ, సైనిక ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్న సమయంలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హోర్ముజ్ జలసంధి తమ ప్రత్యక్ష నియంత్రణలోనే ఉందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ద్వారా టెహ్రాన్ స్పష్టం చేస్తోంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గంగా ఉన్న ఈ జలసంధి భద్రత మరింత సంక్లిష్టంగా మారింది. సముద్ర రవాణా మార్గాలు సురక్షితంగా కొనసాగేలా అమెరికా సైనిక, వైమానిక రక్షణను అందిస్తోంది. మరోవైపు ఈ ఆధిపత్య పోరు ప్రపంచ చమురు సరఫరాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాన్ని అంతర్జాతీయ సమాజం నిశితంగా పరిశీలిస్తోంది.

Advertisement
Advertisement