Devi Prasad | మూడేండ్లలో ఒక్క డీఏ ఇవ్వలే.. ఇగ పీఆర్సీ అయితే ఊసే లేదు
Devi Prasad | మూడేండ్లలో ఒక్క డీఏ కూడా ఇవ్వలేదని.. మొత్తం ఆరు డీఏలు రావాల్సి ఉందని మాజీ ఉద్యోగ సంఘాల నాయకుడు జి.దేవిప్రసాద్ అన్నారు. ఒక్కో ఉద్యోగి రూ.10 వేల నుంచి 20 వేల వరకు నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
- ఒక్కో ఉద్యోగి రూ.10 వేల నుంచి 20 వేల వరకు నష్టపోతున్నడు
- ఉమ్మడి ఏపీ, తెలంగాణ చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలే
- కమిటీ రిపోర్ట్ ఇయ్యాడినికే మూడేండ్లు అయితే పీఆర్సీ ఎప్పుడమలైతది?
- రేవంత్ పాలనపై మాజీ ఉద్యోగ సంఘాల నాయకుడు జి.దేవిప్రసాద్ ఫైర్
Devi Prasad | త్రినేత్ర.న్యూస్: మూడేండ్లలో ఒక్క డీఏ కూడా ఇవ్వలేదని.. మొత్తం ఆరు డీఏలు రావాల్సి ఉందని మాజీ ఉద్యోగ సంఘాల నాయకుడు జి.దేవిప్రసాద్ అన్నారు. ఒక్కో ఉద్యోగి రూ.10 వేల నుంచి 20 వేల వరకు నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పీఆర్సీ అయితే ఊసే లేదని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణ చరిత్రలో ఏనాడు ఇలా జరగలేదని విమర్శించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ సభ పెట్టుకోవాలన్నా అనుమతి కోసం కోర్టు దాకా పోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు.
డీఏలు ఆరు రావాలి. దేశంలో ఏ రాష్ట్రంలో పెండింగ్‌లో లేవు. రేవంత్ ప్రజా పాలనలోనే పెండింగ్ ఉన్నయ్. మూడు సంవత్సరాల నుంచి డీఏలు లేవు. ఒక్కొక్క ఉద్యోగి రూ.10 వేల నుంచి 20 వేల వరకు నష్టపోతా ఉన్నడు. యుద్ధం కారణంగా ధరలు పెరిగినయ్. నిత్యావసర ధరలు పెరిగినయ్. ఇన్ని పెరిగినా ఒకవైపు హెల్త్ కార్డ్ ఇవ్వరు.. పీఆర్సీ బెనిఫిట్స్ ఇవ్వరు. ఇంకొక వైపు డీఏ ఇవ్వరు. ఇక పీఆర్సీ అయితే అడుగుడే బంజేసిర్రు.
ఉమ్మడి ఏపీ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో రేవంత్ పాలనలో మూడుసార్లు పీఆర్సీ రాకుండా ఉన్నది. పీఆర్సీ ఉండేదే అయిదేళ్ల గడువు. మీరు కమిటీ రిపోర్ట్ ఇయ్యడానికే మూడు సంవత్సరాలు తీసుకుంటే పీఆర్సీ ఎప్పుడు అమలైతది.. ఎప్పుడిస్తరు?
తెలంగాణ మినీ ఎమర్జెన్సీగా మారిపోయింది..
సీపీఎస్ ఉద్యోగులకు హామీ ఇచ్చిర్రు. కనీసం వారు సభ పెట్టుకుంటమంటే పోలీసుల పర్మిషన్ లేదు. ఇవాళ తెలంగాణ ఒక మినీ ఎమర్జెన్సీగా మారిపోయింది. బీఆర్ఎస్ పక్షాన నిరుద్యోగ సంగ్రామ సభ పెడితే అనుమతివ్వరు. ఇందిరా పార్కు దగ్గర సభ పెడితే అనుమతివ్వరు. అన్నింటికి కోర్టుకు పోయి అనుమతి తెచ్చుకోవాలే.
సీపీఎస్ ఉద్యోగులు దేశద్రోహులా?
సీపీఎస్ ఉద్యోగులు ఎల్బీ స్టేడియంల సభ పెడతమంటే మీరు పర్మిషన్ ఇవ్వరా? వాళ్లేమన్నా దేశద్రోహులా? 70-80 వేల మంది కానిస్టేబుళ్లు శాంతి భద్రతలు నిర్వహిస్తున్న వాళ్లే సీపీఎస్ మెంబర్లుగా ఉన్నరన్న విషయం రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఇయ్యాళ మూడు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉంటే మీరు మేనిఫెస్టోలో పెట్టి వారికి హామీ ఇచ్చి మూడేండ్లు అయింది. దాన్ని పట్టచ్చుకోరు. ఇప్పటివరకు కమిటీ ఎయ్యరు. కనీసం సభ పెట్టి ప్రజల దృష్టికి తీసుకొద్దామని అనుకుంటే కోర్టుకు పోయేదాకా పర్మిషన్ ఇవ్వరా? ఇది ఏమన్నా ఎమర్జెన్సీ విధించిర్రా? రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నరా? పోలీసు రాజ్యంగా మారుస్తున్నరా?
సనత్‌నగర్ టిమ్స్‌కు సూద్దామని పోతుంటే హరీశ్‌రావును, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను, శ్రీనివాస్‌గౌడ్‌ను ఇంటికెళ్లి కాలు బయట పెట్టకముందే అరెస్టు చేస్తున్నరు. అంటే ఆస్పత్రులు చూడొద్దు ప్రజలకు చెప్పొద్దు. ఇదేనా మీ పాలనా? నిరసనలు తెలిపే వారికి మద్దతుగా వెళ్తున్న మా పార్టీ నాయకులను నిర్బంధిస్తున్నారు అని దేవీప్రసాద్ ఫైరయ్యారు.
సంబంధిత వార్తలు

Deviprasad | ఉద్యోగులకు స్మార్ట్ హెల్త్ కార్డులు ఎందుకు ఇవ్వరు?
ఆగస్టు 22, 2026

Ponnam Prabhakar | తెలంగాణకు నిధులెందుకు ఇవ్వరు?.. బీజేపీ రాష్ట్ర నాయకులు సమాధానం చెప్పాలి
ఆగస్టు 22, 2026

Srinivas Goud | ఉద్యోగుల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది : మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ఆగస్టు 22, 2026
తాజావార్తలు
- ●Canada | కెనడా సంచలన నిర్ణయం.. అమెరికాతో వాణిజ్య చర్చలు నిలిపివేత
- ●Kaaka Movie | ‘కాకా’గా చిరంజీవి.. డబుల్ షేడ్స్‌లో మెగాస్టార్ అదుర్స్..!
- ●Revanth Reddy US Tour | రేవంత్ యూఎస్ టూర్ వెనుక అసలు ఉద్దేశం అదేనా? అందుకే కేంద్రం నో చెప్పిందా?
- ●Strait of Hormuz | హోర్ముజ్‌లో ఉద్రిక్తతలు ఉన్నా, కొనసాగుతున్న చమురు రవాణా..అమెరికా ఇంధన శాఖ మంత్రి వెల్లడి..
- ●Deviprasad | ఉద్యోగులకు స్మార్ట్ హెల్త్ కార్డులు ఎందుకు ఇవ్వరు?
- ●EVM Manipulation | ఈవీఎం హ్యాకింగ్ సాధ్యమేనా? నెట్టింట Form 17C వైరల్

Canada | కెనడా సంచలన నిర్ణయం.. అమెరికాతో వాణిజ్య చర్చలు నిలిపివేత

Kaaka Movie | ‘కాకా’గా చిరంజీవి.. డబుల్ షేడ్స్‌లో మెగాస్టార్ అదుర్స్..!

Revanth Reddy US Tour | రేవంత్ యూఎస్ టూర్ వెనుక అసలు ఉద్దేశం అదేనా? అందుకే కేంద్రం నో చెప్పిందా?

Strait of Hormuz | హోర్ముజ్‌లో ఉద్రిక్తతలు ఉన్నా, కొనసాగుతున్న చమురు రవాణా..అమెరికా ఇంధన శాఖ మంత్రి వెల్లడి..



