Gade Innaiah gets bail | తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యకు బెయిల్.. మంజూరు చేసిన హైకోర్టు
Gade Innaiah | ఎన్ఐఏ కేసులో తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకు బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
- ప్రతి శుక్రవారం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని షరతు
Gade Innaiah gets bail | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకు ఎన్ఐఏ కేసులో బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల అదనపు పూచీకత్తుతో రెండు షూరిటీ బాండ్లను సమర్పించాలని కోర్టు స్పష్టం చేసింది. ప్రతి శుక్రవారం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణాధికారి ఎదుట తప్పకుండా హాజరుకావాలని సూచించింది.
మావోయిస్టు అగ్రనేత కట్టా రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని విప్లవ భావజాలాన్ని ప్రచారం చేశారంటూ NIA ఇన్నయ్యపై కేసు పెట్టింది. అంత్యక్రియల సందర్భంగా ఆయన మావోలకు అనుకూలంగా ప్రసంగించారని.. ఉద్యమాన్ని ఉసిగొల్పేలా మాట్లాడారని ఎన్ఐఏ ఆయనపై అభియోగాలు మోపింది. దీంతో ‘ఉపా చట్టం’ కింద కేసు పెట్టి గతేడాది డిసెంబర్ 21న జనగామ జిల్లాలోని జఫర్‌గడ్‌లోని ఆయన ఇంటి వద్ద ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.
దీంతో గత 8 నెలలుగా హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో ఉన్నారు. తాజాగా హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు రానున్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao | తెలంగాణ భవన్‌కు పోటెత్తిన 22A బాధితులు.. సమస్యలు విని బాధితులకు భరోసా ఇచ్చిన హరీశ్‌రావు
ఆగస్టు 19, 2026

MLA Sudheer Reddy | మేం టిమ్స్‌కు వెళ్తే డొల్లతనం బయటపడుతుందని భయం.. అందుకే అడ్డుకుంటున్నరు
ఆగస్టు 19, 2026

Principal Murdered | ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు.. 27 సార్లు కత్తితో పొడిచి చంపిన టెన్త్ విద్యార్థులు
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Ayesha Khan | డైమండ్ రింగ్‌తో అయేషా ఖాన్.. ఎంగేజ్మెంట్ చేసుకుందా ఏంటీ..?
- ●Bengaluru Traffic | ఉదయం 10 అయినా ఆఫీసులో ఖాళీ కుర్చీలు దర్శనం.. స్టార్టప్ ఫౌండర్ పోస్ట్ వైరల్
- ●Sampath Kumar Padayatra | వరుణ దేవుడి కరుణ కోసం.. అలంపూర్‌లో సంపత్ కుమార్ మెగా పాదయాత్ర!
- ●Harish Rao | తెలంగాణ భవన్‌కు పోటెత్తిన 22A బాధితులు.. సమస్యలు విని బాధితులకు భరోసా ఇచ్చిన హరీశ్‌రావు
- ●Aadhaar | తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 30 వరకు పిల్లలకు ఆధార్ అప్డేట్స్ ఫ్రీ..
- ●CM Vijay | విద్యార్థి నిరసనలపై విజయ్ సర్కార్ యూటర్న్.. వివాదాస్పద ఆదేశాలు రద్దు

Ayesha Khan | డైమండ్ రింగ్‌తో అయేషా ఖాన్.. ఎంగేజ్మెంట్ చేసుకుందా ఏంటీ..?

Bengaluru Traffic | ఉదయం 10 అయినా ఆఫీసులో ఖాళీ కుర్చీలు దర్శనం.. స్టార్టప్ ఫౌండర్ పోస్ట్ వైరల్

Sampath Kumar Padayatra | వరుణ దేవుడి కరుణ కోసం.. అలంపూర్‌లో సంపత్ కుమార్ మెగా పాదయాత్ర!

Harish Rao | తెలంగాణ భవన్‌కు పోటెత్తిన 22A బాధితులు.. సమస్యలు విని బాధితులకు భరోసా ఇచ్చిన హరీశ్‌రావు



