త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Seethakka | ప‌ట్నం రోడ్ల‌కు తీసిపోకుండా ప‌ల్లె రోడ్లు : మంత్రి సీత‌క్క‌

Minister Seethakka | గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరిచి, పట్టణ రోడ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా నిర్మాణాలు చేపడుతున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. ఇందుకోసం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.

P

Telangana | Published On Jul 25, 2026, 8.00 pm IST

Minister Seethakka | ప‌ట్నం రోడ్ల‌కు తీసిపోకుండా ప‌ల్లె రోడ్లు : మంత్రి సీత‌క్క‌
Advertisement

Minister Seethakka | గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరిచి, పట్టణ రోడ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా నిర్మాణాలు చేపడుతున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. ఇందుకోసం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. సచివాలయంలో శనివారం పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ దానకిశోర్, ఈఎన్‌సీ జోగారెడ్డి, సీఈలతో కలిసి గ్రామీణ హ్యామ్ రోడ్ల నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామానికి నాణ్యమైన రోడ్డు కనెక్టివిటీ కల్పించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు.

హ్యామ్ విధానంలో రాష్ట్రంలోని 6,703 గ్రామాల్లో 18,472 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. తొలివిడతలో 2,678 గ్రామాల్లో 7,450 కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణ, పునర్నిర్మాణ పనులు చేపడుతున్నామని చెప్పారు. ఇందులో 90 శాతం పనులు ప్రస్తుతం ఉన్న రహదారుల ఆధునీకరణకే కేటాయించినట్లు వెల్లడించారు. దశాబ్దాలుగా రవాణా సౌకర్యం లేని 179 గ్రామాలకు తొలిసారిగా 934 కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న హ్యామ్ విధానాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలు పరిశీలిస్తున్నాయని, అందుకు అనుగుణంగా మార్గదర్శకాలను రూపొందించామని చెప్పారు.

ఆర్బీఐ అనుమతులు వచ్చే వారంలోగా పూర్తవుతాయని, ఆగస్టు 15 నాటికి కాంట్రాక్ట్ అగ్రిమెంట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఒప్పందాలు పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. టెండర్లు దక్కించుకోవడంలో చూపిన ఉత్సాహాన్ని పనుల పూర్తిలోనూ చూపాల‌న్నారు. గతంలో సింగిల్ రోడ్లు ఉన్న ప్రాంతాల్లోనూ భారీ వాహనాలు రాకపోకలు సాగించేలా నాణ్యమైన రహదారులు నిర్మించాలని మంత్రి సూచించారు. భూసేకరణ, చెట్ల తొలగింపు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో ఎదురయ్యే సమస్యలను తన దృష్టికి తీసుకురావచ్చని కాంట్రాక్టర్లకు భరోసా ఇచ్చారు.

Advertisement
Advertisement