త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mandula Samuel | కాంగ్రెస్‌ల‌కొస్తే నువ్ గెలుస్త‌వ్ సామేల్ అన్న‌డు.. నేన్ అబ‌ద్ద‌మాడా

Mandula Samuel | కాంగ్రెస్‌ల‌కొస్తే గెలుస్త‌వ‌ని రాజ‌గోపాల్‌రెడ్డి నాతో అన్నాడ‌ని.. నేన్ అబ‌ద్దామాడా అని తుంగ‌తుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వ్యాఖ్యానించారు. ఆయ‌న బీజేపీల ఉన్న‌ప్పుడే నేన్ కాంగ్రెస్‌ల‌కొచ్చాన‌ని తెలిపారు. టికెట్ నా జేబులోనో, రాజ‌గోపాల్‌రెడ్డి జేబులోనో ఉండ‌ద‌న్నారు.

S

Telangana | Published On Jul 25, 2026, 7.21 pm IST

Mandula Samuel | కాంగ్రెస్‌ల‌కొస్తే నువ్ గెలుస్త‌వ్ సామేల్ అన్న‌డు.. నేన్ అబ‌ద్ద‌మాడా
Advertisement
  • ఆయ‌న కంటే ముందే నేన్ కాంగ్రెస్‌ల‌కొచ్చిన‌.. నాకెవ‌రూ టికెట్ ఇప్పియ్య‌లే
  • రెడ్లు నాకోట్లేసిర్రు.. మాదిగోళ్లు ఆయ‌న‌కోట్లేసిర్రు
  • ఈ లొల్లి వాళ్లాపితే మంచిదే
  • కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌పై ఎమ్మెల్యే మందుల సామేల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Mandula Samuel | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్‌ల‌కొస్తే గెలుస్త‌వ‌ని రాజ‌గోపాల్‌రెడ్డి నాతో అన్నాడ‌ని.. నేన్ అబ‌ద్దామాడా అని తుంగ‌తుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వ్యాఖ్యానించారు. ఆయ‌న బీజేపీల ఉన్న‌ప్పుడే నేన్ కాంగ్రెస్‌ల‌కొచ్చాన‌ని తెలిపారు. టికెట్ నా జేబులోనో, రాజ‌గోపాల్‌రెడ్డి జేబులోనో ఉండ‌ద‌న్నారు. రెడ్లు నాకు ఓట్లేశార‌ని, మాదిగ‌లు కూడా ఆయ‌న‌కు ఓట్లు వేశార‌ని పేర్కొన్నారు. ఈ వివాదాన్ని ఇంకా కొనసాగిస్తారా అని విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ ఈ లొల్లి వాళ్లు ఆపితే మంచిదేన‌ని అన్నారు. సామేల్‌కు టికెట్ నేనే ఇప్పించాన‌ని రాజగోపాల్‌రెడ్డి అన‌డంతో ఆయ‌న పై విధంగా స్పందించారు.

నా తుంగ‌తుర్తి ప్ర‌జ‌లు గెలిపిచ్చిర్రు..

నాకు ఎవ‌రూ టికెట్ ఇప్పించ‌లే. కాంగ్రెస్ టికెట్ అనేది నా జేబుల‌నో, రాజ‌గోపాల్‌రెడ్డి జేబుల‌నో ఉండ‌ది. అధిష్టానం చేతిల ఉంట‌ది. ఎవ‌రు గెలుస్తర‌నుకుంటే వాళ్ల‌కు ఇస్త‌రు టికెట్‌. న‌న్ను నా తుంగ‌తుర్తి ప్ర‌జ‌లు గెలిపిచ్చిర్రు. మునుగోడులో రాజ‌గోపాల్‌రెడ్డిని గెలిపించి త‌ప్పు చేశామ‌ని నా అభిమానులు అనుకుంటున్న‌రు. నువ్ గెలుస్త‌వ్ సామేల్ కాంగ్రెస్‌ల‌కొస్తే అని రాజ‌గోపాల్‌రెడ్డి అన్న‌డు. నేన్ అబ‌ద్ద‌మాడా. అప్పుడు ఆయిన బీజేపీల ఉన్న‌డు. నేన్ కాంగ్రెస్‌ల చేరిన. ఆయ‌న కంటే ముంగ‌ట‌నే కాంగ్రెస్‌ల‌కొచ్చిన. నియోజ‌క‌వ‌ర్గ విష‌యంలో ఇన్వాల్వ్ కావొద్ద‌ని కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌కు చెప్పిన‌ అని సామేల్ వివ‌రించారు.

నాకొక్క మాట చెప్తే నేన్‌గూడా పోదు గ‌దా..

నిన్న నా నియోజ‌క‌వ‌ర్గానికొచ్చిండు. నాకు తెల్వ‌కుండా నా వ‌చ్చిండు. మంత్రి వ‌చ్చిన‌ప్పుడు అటెండ‌ర్‌తో ఫోన్ చేపిచ్చినా పోయి క‌లిసేటోన్ని. రెండు కిలోమీట‌ర్ల రోడ్డు కోసం వంద‌ల‌సార్లు చెప్పిన. నేను ఎన్నోమాట్ల రోడ్డు ఇయ్య‌మ‌ని అడిగితే ఇయ్య‌లే. నిన్న పోతూ పోతూ వారు ఆ రోడ్డును ప‌రిశీలించిర్రు. నాకొక్క మాట చెప్తే నేన్‌గూడా పోదు గ‌దా. రెడ్లు నాకు ఓట్లేసిండ్రు.. మాదిగోళ్లు ఆయ‌న‌కు ఓట్లేసిండ్రు. ఇగ రాజ‌కీయం అయిపోయింది. ఇగ అధిష్టానం ఏం నిర్ణ‌యం చేసిందో.. ఏం ఆలోచ‌న చేసిందో నాకు తెల్వ‌ద‌ది. నేన్ పెద్దొళ్ల‌తోటి ఎవ్వ‌రితోటి మాట్లాడ‌లే. ఈ లొల్లి వాళ్లు ఆపితే మంచిదే అని ఎమ్మెల్యే సామేల్ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement