WhatsApp | ఇకపై వాట్సాప్ ద్వారా విద్యార్థుల సమాచారం.. డిజిటల్ బాటలో సర్కారు బడులు..
WhatsApp | మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారా?. అయితే వారి అటెండెన్స్, పరీక్షల సమాచారం, ఎలా చదువుతున్నారు, విద్యా సామాగ్రి పంపిణీ, స్కాలర్‌షిప్‌లు, పాఠశాల కార్యక్రమాలు, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాల వంటి పాఠశాల విద్యకు (School Education) సంబంధించిన ముఖ్యమైన సమాచారం, సేవలు, ప్రభుత్వ కార్యక్రమాల వివరాలు ఇకపై వాట్సాప్ (WhatsApp) ద్వారా నేరుగా మీ ఫోన్‌కు చేరనున్నాయి.
WhatsApp | త్రినేత్ర.న్యూస్: మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారా?. అయితే వారి అటెండెన్స్, పరీక్షల సమాచారం, ఎలా చదువుతున్నారు, విద్యా సామాగ్రి పంపిణీ, స్కాలర్‌షిప్‌లు, పాఠశాల కార్యక్రమాలు, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాల వంటి పాఠశాల విద్యకు (School Education) సంబంధించిన ముఖ్యమైన సమాచారం, సేవలు, ప్రభుత్వ కార్యక్రమాల వివరాలు ఇకపై వాట్సాప్ (WhatsApp) ద్వారా నేరుగా మీ ఫోన్‌కు చేరనున్నాయి. మీసేవ (MeeSeva) సహకారంతో అన్ని పాఠశాలల సమాచారం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు, విద్యార్థులకు అందించనున్నారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇది అందుబాటులోకి రానుంది.
విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులు, హాల్ టికెట్ల డౌన్‌లోడ్, మార్కుల మెమోలు, పరీక్షా ఫలితాలు, ఎస్‌ఎస్‌సీ మెమోలు, బోనఫైడ్ సర్టిఫికెట్లు, ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్లు, ఎస్‌ఎస్‌సీ మెమో సవరణల దరఖాస్తులు వంటి అన్ని సేవలు దీని ద్వారా పొందవచ్చు. యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ వివరాలు, విద్యార్థుల హాజరు సమాచారం, ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ దరఖాస్తులు, మధ్యాహ్న భోజన పథకం వివరాలు, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలు, క్రీడలు, సహపాఠ్య కార్యక్రమాల సమాచారం, రెసిడెన్షియల్ పాఠశాలల సంక్షేమ కార్యక్రమాల వివరాలు, విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణ వంటి వివరాలన్నీ వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు అందించనున్నారు. ఈ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
తాజావార్తలు
- ●Ramchandar Rao | బీజేపీలోకి మెగాస్టార్ చిరంజీవి?
- ●Train Ticket | రైళ్లలో ఇక టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే రెట్టింపు జరిమానా.. జూలై 1 నుంచి కొత్త రూల్స్..
- ●Uttar Pradesh | పోర్న్ వీడియోలు చూసి.. 9 నెలల పసికందుపై అత్యాచారం
- ●HIV | హెచ్ఐవీ రోగులకు కొత్త ఆశ.. ప్రపంచంలోనే తొలి హెచ్ఐవీ-టు-హెచ్ఐవీ ఊపిరితిత్తుల మార్పిడి విజయవంతం..
- ●Ramakrishna Rao | సీఎస్ రామకృష్ణా రావుకు మళ్లీ ఎక్స్ టెన్షన్?
- ●Revanth Reddy | ఆదిలాబాద్‌లో ఎయిర్‌లైన్ హ్యాంగర్స్ ఏర్పాటు చేయండి.. రాజ్‌నాథ్ సింగ్‌కి సీఎం రేవంత్ విజ్ఞప్తి

Ramchandar Rao | బీజేపీలోకి మెగాస్టార్ చిరంజీవి?

Train Ticket | రైళ్లలో ఇక టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే రెట్టింపు జరిమానా.. జూలై 1 నుంచి కొత్త రూల్స్..

Uttar Pradesh | పోర్న్ వీడియోలు చూసి.. 9 నెలల పసికందుపై అత్యాచారం

HIV | హెచ్ఐవీ రోగులకు కొత్త ఆశ.. ప్రపంచంలోనే తొలి హెచ్ఐవీ-టు-హెచ్ఐవీ ఊపిరితిత్తుల మార్పిడి విజయవంతం..





