త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | ఇవాళ రాత్రి 10 వ‌ర‌కు హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు..!

Traffic Restrictions | మొహర్రం పండుగ సంద‌ర్భంగా హైద‌రాబాద్( Hyderabad ) పాత బ‌స్తీ( Old City )లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించిన‌ట్లు పోలీసులు తెలిపారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు( Traffic Restrictions ) అమ‌ల్లో ఉంటాయ‌ని పేర్కొన్నారు.

S

Hyderabad | Published On Jun 26, 2026, 10.28 am IST

Traffic Restrictions | ఇవాళ రాత్రి 10 వ‌ర‌కు హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు..!
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర‌.న్యూస్ : మొహర్రం పండుగ సంద‌ర్భంగా హైద‌రాబాద్( Hyderabad ) పాత బ‌స్తీ( Old City )లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించిన‌ట్లు పోలీసులు తెలిపారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు( Traffic Restrictions ) అమ‌ల్లో ఉంటాయ‌ని పేర్కొన్నారు. బీబీ కా ఆలావ‌( Bibi-ka-Alawa ) ఊరేగింపు సంద‌ర్భంగా ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు.

ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఈ ప్ర‌దేశాల్లోనే..

సునార్‌గ‌ల్లీ, జ‌బ్బ‌ర్ హోట‌ల్, ఈతెబార్ చౌక్, పురానీ హ‌వెలీ, బీబీ బజార్ క్రాస్ రోడ్స్, గుల్జార్ హౌజ్, చార్మినార్, మ‌దీనా క్రాస్ రోడ్స్, సాలార్ జంగ్ రోట‌రీ, చాదర్‌ఘాట్ రోట‌రీ, న‌యాపూల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మ‌ళ్లింపులు చేప‌ట్ట‌నున్నారు.

బీబీ కా ఆలావ‌, షేక్ ఫైజ్ క‌మాన్, బాడా బ‌జార్, ఈతెబార్ చౌక్, చార్మినార్, పురానీ హ‌వెలీ, మిరాలం మండి, ఆల‌వాస‌ర్తాక్‌వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను ఇత‌ర మార్గాల్లో మ‌ళ్లిస్తామ‌ని పోలీసులు తెలిపారు. ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా ప్ర‌యాణికులు, వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంపిక చేసుకోవాల‌ని సూచించారు.

జిల్లాల నుంచి వ‌చ్చే ఆర్టీసీ బ‌స్సుల‌ను రంగ మ‌హ‌ల్, అఫ్జ‌ల్‌గంజ్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ఈ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌న్నారు. మొహ‌ర్రం ఊరేగింపు ముగిసేదాకా కాలిఖ‌బార్, మిరాలం మండి రోడ్ల‌ను మూసివేయ‌నున్నారు.

Advertisement
Advertisement