Plastic Flowers | రాష్ట్రంలో ప్లాస్టిక్ పూల అమ్మకాలపై నిషేధం..
Plastic Flowers | ప్లాస్టిక్ పూల (Plastic Flowers) అమ్మకాలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ మార్కెట్లలో ప్లాస్టిక్ పూలపై నిషేధం విధించింది. ఇక నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ మార్కెట్లలో (Government Markets) ప్లాస్టిక్ పూలను విక్రయించకూడదని, ఎవరైనా అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Plastic Flowers | త్రినేత్ర.న్యూస్: ప్లాస్టిక్ పూల (Plastic Flowers) అమ్మకాలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ మార్కెట్లలో ప్లాస్టిక్ పూలపై నిషేధం విధించింది. ఇక నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ మార్కెట్లలో (Government Markets) ప్లాస్టిక్ పూలను విక్రయించకూడదని, ఎవరైనా అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్ కూడా రద్దు చేస్తామని స్పష్టం చేసింది. రైతు బజార్లు (Rythu Bazaar), ప్రభుత్వ మార్కెట్లలో ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. సహజ పూలు, వాటి ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని వెల్లడించింది.
ప్రభుత్వ రైతు బజార్లు, మార్కెట్లలో సహజ పూలను కాకుండా ప్లాస్టిక్ పూలను ఎక్కువగా అమ్ముతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ప్లాస్టిక్ పూల వల్ల సహజ పూల విక్రయాలు జరగడం లేదని, దీంతో తమకు నష్టం జరుగుతోందని పూల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన మంత్రి ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ పూల విక్రయంపై నిషేధం అమల్లో ఉంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






