Palapitta | దసరా మండపాల వద్ద పాలపిట్టను ప్రదర్శిస్తే కఠిన చర్యలు.. అటవీ శాఖ
Palapitta | దసరా పండుగ సందర్భంగా మండపాల వద్ద పాలపిట్టను (Palapitta) ప్రదర్శించినా, పట్టుకున్నా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు (Forest Department) హెచ్చరించారు. రాష్ట్ర పక్షిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదర్శించ కూడదని ప్రజలకు సూచించారు.
Palapitta | త్రినేత్ర న్యూస్: దసరా పండుగ సందర్భంగా మండపాల వద్ద పాలపిట్టను (Palapitta) ప్రదర్శించినా, పట్టుకున్నా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు (Forest Department) హెచ్చరించారు. రాష్ట్ర పక్షిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదర్శించ కూడదని ప్రజలకు సూచించారు. చట్టవిరుద్ధంగా పాలపిట్టను వినియోగించినవారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. పాలపిట్ట పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక పోస్టర్లను రూపొందించారు. దసరా మండపాల (Dasara Festival) నిర్వాహకులకు ఈ పోస్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తూ, పక్షులను బంధించడం, ప్రదర్శించడం వంటి చర్యలకు పాల్పడవద్దని సూచిస్తున్నారు.
జీవవైవిధ్యంలో పాలపిట్ట (Indian Roller) కీలకమైన పక్షి అని, వన్యప్రాణుల సంరక్షణపై ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉందని చెప్పారు. పండుగ సంప్రదాయాల పేరుతో పక్షులకు హాని కలిగించే చర్యలకు పాల్పడకూడదని స్పష్టం చేశారు. దసరా మండపాల వద్ద పాలపిట్టను ప్రదర్శిస్తున్నట్లు గుర్తించినట్లయితే ప్రజలు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. పాలపిట్టను రక్షించడం, వన్యప్రాణుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
- ●Apple | ఐఫోన్ 17కు డిమాండ్ దెబ్బ.. ఉత్పత్తిని తగ్గించిన యాపిల్..
- ●blast at chemical unit | రసాయన పరిశ్రమలో భారీ పేలుడు.. ఐదుగురు కార్మికులు మృతి
- ●Must Visit Temples in India | జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన 7 దేవాలయాలు.. వాటి ప్రత్యేకతలు ఇవే!
- ●Supreme Court | మేమే అక్కడ ధర్నాకు దిగుతాం.. సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు
- ●Ponnam Prabhakar | రోడ్డు ప్రమాదాల నివారణే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Door of Hell Turkmenistan | భూమిపై 'నరక ద్వారం' ఎక్కడుందో తెలుసా? 50 ఏళ్లుగా ఆరకుండా మండుతున్న ఈ మిస్టరీ వెనుక అసలు కథ ఇదే!

Apple | ఐఫోన్ 17కు డిమాండ్ దెబ్బ.. ఉత్పత్తిని తగ్గించిన యాపిల్..

blast at chemical unit | రసాయన పరిశ్రమలో భారీ పేలుడు.. ఐదుగురు కార్మికులు మృతి

Must Visit Temples in India | జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన 7 దేవాలయాలు.. వాటి ప్రత్యేకతలు ఇవే!

Supreme Court | మేమే అక్కడ ధర్నాకు దిగుతాం.. సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు






