Six Guarantees | ఆరు గ్యారెంటీలకు రూ. 50,713 కోట్లు.. ఈసారైనా అమలయ్యేనా..?
Six Guarantees | అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆ హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు మరో రెండేండ్లలో రానున్న నేపథ్యంలో సంక్షేమ పథకాలకు పెద్దపేట వేశారు.
Six Guarantees | త్రినేత్ర.న్యూస్ : అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆ హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు మరో రెండేండ్లలో రానున్న నేపథ్యంలో సంక్షేమ పథకాలకు పెద్దపేట వేశారు. ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమైంది.
ఇప్పటి వరకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు గృహ జ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నారు. చేయూత పథకం ఇప్పటి వరకు అమలు కాలేదు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొనసాగుతోంది. వ్యవసాయ ఉత్పత్తులకు కూడా బోనస్ కార్యక్రమం సరిగా అమలు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎల్‌పీజీ సిలిండర్లకు సబ్సిడీ రాలేదనే అపవాదులు ఉన్నాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఇప్పటికీ అమలు కాలేదు. ఈ నేపథ్యంలో ఆరు గ్యారెంటీలకు రూ. 50,713 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు.
ఆరు గ్యారెంటీలకు కేటాయింపులు ఇలా
రైతు భరోసా - రూ. 18000 కోట్లు
చేయూత - రూ. 14861 కోట్లు
ఇందిరమ్మ ఇండ్లు - రూ. 5,500 కోట్లు
మహాలక్ష్మి (ఆర్టీసీ) - రూ. 4305 కోట్లు
వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్ - రూ. 3,500 కోట్లు
గృహ జ్యోతి(200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్) - రూ. 2,080 కోట్లు
రాజీవ్ ఆరోగ్య శ్రీ - రూ. 1,143 కోట్లు
ఎల్‌పీజీ సబ్సిడీ - రూ. 723 కోట్లు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా - రూ. 600 కోట్లు
తాజావార్తలు
- ●Neymar | కన్నీళ్లతోనే ముగిసిన బ్రెజిల్ స్టార్ ప్రయాణం.. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కు నెయ్మర్ గుడ్‌బై..!
- ●Nampally Criminal Court | నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్నిప్రమాదం..
- ●Venezuela Earthquake | 3,300 దాటిన వెనిజులా భూకంప మృతులు..
- ●Norway vs Brazil | నార్వే హిస్టరీ.. తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఎంట్రీ
- ●Trisha | అవును అతను Ladies man.. రానాపై త్రిష కామెంట్స్..
- ●TG CPGET | సీపీగెట్ హల్‌టికెట్లు విడుదల.. ఎల్లుండి నుంచి పరీక్షలు

Neymar | కన్నీళ్లతోనే ముగిసిన బ్రెజిల్ స్టార్ ప్రయాణం.. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కు నెయ్మర్ గుడ్‌బై..!

Nampally Criminal Court | నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్నిప్రమాదం..

Venezuela Earthquake | 3,300 దాటిన వెనిజులా భూకంప మృతులు..

Norway vs Brazil | నార్వే హిస్టరీ.. తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఎంట్రీ






